శనివారం, 22 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA - అర్జెంటీనా జట్టుకు భారీ జరిమానా - పలువురిపై నిషేధం

15 గంటల క్రితం

FIFA - Heavy fine for Argentina team - Bans imposed on several individuals
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 22, 2026, 12:05 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఫిఫా : ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘంపై భారీ జరిమానా విధించింది. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ అనంతరం మైదానంలో చోటుచేసుకున్న గొడవలు, క్రమశిక్షణ ఉల్లంఘనలపై చర్యలు చేపట్టిన ఫిఫా.. లియోనల్‌ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా బృందానికి రూ.3.64 కోట్ల జరిమానా విధించింది. అలాగే స్పెయిన్‌ ఆటగాళ్లతో ఘర్షణకు దిగిన పలువురు ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బందిపై నిషేధం విధించింది.


జూలై 19న జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో స్పెయిన్‌ చేతిలో ఓటమి అనంతరం అర్జెంటీనా ఆటగాళ్లు మైదానంలో హద్దులు మీరి ప్రవర్తించడాన్ని ఫిఫా తీవ్రంగా పరిగణించింది. క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించినందుకు అర్జెంటీనా ఫుట్‌బాల్ సంఘానికి భారీ జరిమానా విధించడంతోపాటు, ఘటనలో పాల్గొన్న ఆటగాళ్లు, కోచింగ్‌ సిబ్బందిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. అదే సమయంలో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై విజయం సాధించిన అనంతరం అర్జెంటీనా ఆటగాళ్లు ‘ది ఫాల్క్‌లాండ్స్ అర్జెంటీనావే’ అనే సందేశంతో కూడిన బ్యానర్‌ను ప్రదర్శించడాన్ని కూడా ఫిఫా క్రమశిక్షణా ఉల్లంఘనగా పేర్కొంది. ఈ చర్యల్లో భాగంగా అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్‌ లియాండ్రో పరేడ్స్‌, డిఫెండర్‌ నహుల్‌ మొలినా, థియాగో అల్మదాలకు మ్యాచ్‌ల నిషేధం విధించింది. పరేడ్స్‌పై అత్యధికంగా 10 మ్యాచ్‌ల నిషేధంతోపాటు భారీ జరిమానా విధించారు. మొలినా ఏడు మ్యాచ్‌లకు, అల్మదా ఒక మ్యాచ్‌కు దూరం కానున్నారు. మరోవైపు స్పెయిన్‌ ఆటగాడు గవినుపైనా ఒక మ్యాచ్‌ నిషేధాన్ని ఫిఫా విధించింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్