సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

FIFA - ట్రంప్ ఫోన్‌తో మారిన ఫిఫా నిర్ణయం ..!

1 గంట క్రితం

FIFA - ట్రంప్ ఫోన్‌తో మారిన ఫిఫా నిర్ణయం ..!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 12:40 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఫిఫా : అమెరికన్ ఫుట్‌బాలర్‌ ఫోలారిన్‌ బాలోగన్‌పై విధించిన సస్పెన్షన్‌ను ఫిఫా ఎత్తివేసింది. అమెరికా స్టార్ ఫార్వర్డ్ ఫోలారిన్ బలోగన్‌ పై విధించిన ఒక మ్యాచ్ సస్పెన్షన్‌ను ఫిఫా రద్దు చేయడంతో, బెల్జియంతో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌కు అతడు అందుబాటులోకి వచ్చాడు. బోస్నియాతో జరిగిన మ్యాచ్‌లో రెడ్ కార్డ్ పొందిన బలోగన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం వెలువడిందని సమాచారం. ఈ నిర్ణయాన్ని ట్రంప్ స్వాగతించగా... బెల్జియం ఫుట్‌బాల్ సమాఖ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫుట్‌బాల్ సమగ్రతకు ఇది విరుద్ధమని బెల్జియం కోచ్ రూడీ గార్సియా విమర్శించారు. మరోవైపు ... ఫిఫా ఈ సస్పెన్షన్‌ను ఏడాది పాటు షరతులతో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే తరహా తప్పిదం మళ్లీ జరిగితే సస్పెన్షన్ అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం మూడు గోల్స్‌తో బలోగన్ అమెరికా జట్టు తరఫున టోర్నమెంట్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్