మంగళవారం, 07 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సెమీస్‌‌కు గాఫ్‌, సిన్నర్‌

1 గంట క్రితం

wimbul
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 12:14 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- వింబుల్డన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ

లండన్‌: వింబుల్డన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ పురుషుల సింగిల్స్‌ ‌సెమీఫైనల్లోకి టాప్‌‌సీడ్‌, ఇటలీకి చెందిన జెన్నిక్‌ ‌సిన్నర్‌‌తోపాటు మహిళల సింగిల్స్‌‌లో అమెరికా యువ సంచలనం, 7వ ర్యాంకర్‌ ‌కోకో గాఫ్‌ ‌ప్రవేశించారు. మంగళవారం జరిగిన క్వార్టర్‌ ‌ఫైనల్లో గాఫ్‌ 4-6 6-3, 6-3తో మూడుసెట్ల హోరా హోరీ పోరులో 4వ సీడ్‌, అమెరికాకే చెందిన పెగూలాను ఓడించింది. తొలి సెట్‌‌ను సహచర క్రీడాకారిణి, తనకంటే మెరుగైన ర్యాంకర్‌‌కు కోల్పోయిన గాఫ్‌.. ఆ తర్వాత రెండు సెట్లను వరుసగా చేజిక్కించుకొని సెమీస్‌‌కు చేరింది. వింబుల్డన్‌ గ్రాండ్‌ స్లామ్‌ టోర్నీలో సెమీస్‌కు చేరడం ద్వారా 22ఏళ్ల కోకో గాఫ్‌ నాలుగు మేజ‌ర్‌ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో సెమీస్ చేరిన రెండో అతి పిన్న వ‌య‌స్కురాలిగా చ‌రిత్ర సృష్టించింది. గ‌తంలో మారియా ష‌ర‌పోవా 2007 ఫ్రెంచ్ ఓపెన్‌లో (19 ఏళ్లు) ఈ ఫీట్ సాధించింది. ఇక సెమీస్‌లో గాఫ్.. నవోమి ఒసాకా, ముచోవా మధ్య విజేతతో తలపడనుంది.

టాప్‌సీడ్‌ సిన్నర్‌ కూడా..

ఇక పురుషుల సింగిల్స్‌‌లో సిన్నర్‌ 7-5, 7-6(7-4), 6-3తో వరుససెట్లలో స్ట్రఫ్‌(‌జర్మనీ)ను ఓడించాడు. ఇక సోమవారం జరిగిన ప్రీ క్వార్టర్‌ ‌ఫైనల్లో బ్రిటన్‌‌కు చెందిన అన్‌‌సీడెడ్‌ ఆర్డర్‌ ఫెర్రీ.. డిమిట్రోవ్‌‌(‌బల్గేరియా)ను చిత్తుచేసి క్వార్టర్‌ ‌ఫైనల్‌‌కు చేరాడు.

ఐదుసెట్ల హోరా హోరీ పోరులో ఆర్దర్‌ ‌ఫెర్రీ 7-5, 3-6, 4-6, 6-4, 7-6(10-7)తో డిమిట్రోవ్‌‌ను చిత్తుచేశాడు. చివరి ప్రీ క్వార్టర్స్‌‌లో టేలర్‌ ఫ్రిట్జ్‌ 7-6(7-1), 6-4, 6-4తో 10వ సీడ్‌, కజకిస్తాన్‌‌కు చెందిన బుబ్లిక్‌‌ను ఓడించి క్వార్టర్స్‌‌కు చేరాడు. బుధవారం జరిగే క్వార్టర్‌ ‌ఫైనల్లో కోబొలితో ఆర్దర్‌ ఫెర్రీ తలపడనున్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్