మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. 20 బంతుల్లోనే అర్ధశతకం

3 రోజుల క్రితం

Harry Brooks onslaught half century in just 20 balls
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 05:00 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ 20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌ బ్యాట్‌తో చెలరేగారు. ఆసీస్ బౌలర్లపై సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి కేవలం 20 బంతుల్లోనే అర్ధశతకాన్ని నమోదు చేశారు. తద్వారా ఆస్ట్రేలియాపై టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్‌ సెంచరీ సాధించిన ఇంగ్లండ్‌ బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు.


టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్‌ ఫిల్‌ సాల్ట్‌ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరగగా, అన్యూరిన్‌ డోనాల్డ్‌ (10) కూడా త్వరగానే ఔటయ్యారు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ బ్రూక్‌ దూకుడుగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నాలుగో ఓవర్‌లో రిలే మెరెడిత్‌ బౌలింగ్‌లో వరుసగా మూడు సిక్సర్లు బాది 23 పరుగులు రాబట్టారు. అనంతరం బెన్‌ డ్వార్షుయిస్‌, జాక్‌ ఎడ్వర్డ్స్‌ బౌలింగ్‌లోనూ భారీ షాట్లతో చెలరేగి 20 బంతుల్లోనే అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నారు.


ఈ క్రమంలో 2018లో ఎడ్జ్‌బాస్టన్‌లో జోస్‌ బట్లర్‌ 22 బంతుల్లో సాధించిన రికార్డును బ్రూక్‌ అధిగమించారు. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ (ఎంసీజీ)లో నమోదైన అత్యంత వేగవంతమైన టీ20 అర్ధశతకాల జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. ఈ మైదానంలో డేవిడ్‌ వార్నర్‌ 19 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ సాధించి అగ్రస్థానంలో ఉన్నారు.


కాగా, ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. బ్రూక్‌ 28 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 65 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచారు. టామ్‌ బాంటన్‌ 39, జోర్డాన్‌ కాక్స్‌ 27 పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో నిఖిల్‌ చౌదరి, జాక్‌ ఎడ్వర్డ్స్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్