పాకిస్తాన్‌పై 5-3గోల్స్‌తో గెలుపు
బ్రసెల్స్: ఎఫ్‌ఐహెచ్ హాకీ ప్రపంచకప్‌లో భారత పురుషుల హాకీ జట్టు కీలక పోరులో సమిష్టిగా రాణించింది. ఆమ్‌స్టల్‌వీన్ వేదికగా పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన పూల్-డి కీలక మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్ సేన 5-3 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ఈ గ్రూప్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకొని టాప్-2లో నిలిచి రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. ఆరంభం నుంచే భారత జట్టు దూకుడు ప్రదర్శించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, ఫార్వర్డ్ అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగారు. దీంతో మ్యాచ్ రెండో క్వార్టర్ పూర్తయ్యేసరికి భారత్ 3-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత మూడో క్వార్టర్‌లో పాక్ పుంజుకుని రెండు గోల్స్ సాధించినా.. భారత్ వెంటనే మరో గోల్ కొట్టి 4-2 ఆధిక్యాన్ని సంపాదించింది. చివరి క్వార్టర్‌లో పాక్ మరో గోల్ చేయగా.. భారత డిఫెండర్లు అడ్డుగోడగా నిలిచారు. చివర్లో ఇరుజట్లు ఒక్కో గోల్ కొట్టడంతో భారత్ 5-3తో ఆధిక్యతలో నిలిచింది. బుధవారం జరిగిన ఇతర పోటీల్లో ఇంగ్లండ్ జట్టు వేల్స్‌పై ఘన విజయం సాధించి పూల్-డిలో టాప్‌తో ముగించింది. ఈ పూల్‌లో ఇంగ్లండ్ ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించి గ్రూప్ టాపర్‌గా నిలిచింది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 4-1తో, రెండో మ్యాచ్‌లో ఇండియాపై 4-2తో గెలిచిన ఇంగ్లాండ్.. బుధవారం జరిగిన చివరి పూల్ లీగ్ మ్యాచ్‌లో వేల్స్‌పై 8-2గోల్స్ తేడాతో ఘన విజయం సాధించి తర్వాతరౌండ్‌కు అర్హత సాధించింది. ఇక మహిళల పూల్-బిలో అర్జెంటీనా 2-0తో స్కాట్లాండ్‌ను, జర్మనీ జట్టు 3-1తో అమెరికాను చిత్తుచేయగా.. పూల్-ఎలో చిలీ-ఆస్ట్రేలియా మ్యాచ్ 4-4గోల్స్‌తో డ్రా అయ్యింది.









కామెంట్‌లు (0)