శుక్రవారం, 20 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

IND vs NEP : రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్ - భారత్ A బ్యాటింగ్‌

10 గంటల క్రితం

IND vs NEP: Emerging Teams Asia Cup – India A Batting
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 20, 2026, 03:25 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న నేపాల్‌


దోహా : ఇటీవల అండర్‌-19 ఆసియా కప్ ‌లో విజేతగా నిలిచి జోరుమీదున్న భారత యువ క్రికెట్‌ జట్టు మరో ఆసియా కప్‌ సమరానికి సిద్ధమైంది. రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌ టోర్నీలో భాగంగా ... వెస్ట్‌ ఎండ్‌ పార్క్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదికగా భారత్‌ A జట్టు తన తొలి మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నేపాల్‌ జట్టు తొలుత ఫీల్డింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది.
మ్యాచ్

ఈ టోర్నీలో భారత్‌ A జట్టుకు తెలుగు ఆటగాడు తిలక్‌ వర్మ నాయకత్వం వహిస్తున్నారు. యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లతో బరిలోకి దిగిన భారత జట్టు తొలి మ్యాచ్‌లోనే విజయంతో టోర్నీని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు నేపాల్‌ జట్టు కూడా భారత బ్యాటర్లను కట్టడి చేసి విజయంతో శుభారంభం చేయాలని భావిస్తోంది.


ఈ జట్టులో అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, రింకూ సింగ్‌, ఆయుష్‌ బదోనీ వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండటం భారత్‌ బ్యాటింగ్‌ విభాగానికి మరింత బలాన్నిస్తోంది. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ బ్యాటింగ్‌ ఎలా ఉంటుందన్న దానిపై క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. రింకూ సింగ్‌ తన దూకుడైన బ్యాటింగ్‌తో జట్టుకు కీలక పరుగులు అందించగలడు. బౌలింగ్‌ విభాగంలో హర్షిత్‌ రాణా, ప్రిన్స్‌ యాదవ్‌, విప్రాజ్‌ నిగమ్‌ వంటి ఆటగాళ్లు భారత్‌కు అందుబాటులో ఉన్నారు.


మరోవైపు నేపాల్‌ జట్టుకు స్టార్‌ స్పిన్నర్‌ సందీప్‌ లామిచానే నాయకత్వం వహిస్తున్నారు. కుశాల్‌ భుర్టెల్‌, దేవ్‌ ఖనాల్‌, లోకేష్‌ బామ్‌ వంటి ఆటగాళ్లు ఆ జట్టులో కీలకంగా ఉన్నారు. భారత బ్యాటింగ్‌ బలాన్ని ఎదుర్కొనేందుకు నేపాల్‌ ప్రధానంగా తన బౌలింగ్‌పై ఆశలు పెట్టుకుంది.


గ్రూప్‌-బిలో భారత్‌

రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో భారత్‌ A జట్టు గ్రూప్‌-బి లో ఉంది. ఈ గ్రూపులో పాకిస్థాన్‌ A, నేపాల్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) జట్లు కూడా ఉన్నాయి. భారత్‌ తన తదుపరి మ్యాచ్‌లో నవంబర్‌ 22న పాకిస్థాన్‌ Aతో, నవంబర్‌ 24న UAEతో తలపడనుంది. గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. నవంబర్‌ 29న ఫైనల్‌ జరగనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్