మంగళవారం, 22 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

IND vs SL : శ్రీలంక గడ్డపై పడిక్కల్‌ శతకం

08 ఆగస్టు, 2026

IND vs SL: Padikkal's century on Sri Lankan soil
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 08, 2026, 02:56 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కొలంబో : శ్రీలంక ఎలెవన్‌తో జరుగుతున్న ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్‌ దేవదత్‌ పడిక్కల్‌ అద్భుత శతకంతో మెరిశాడు. రెండో రోజు ఆటలో 121 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. శ్రీలంక పర్యటనలో భారత్‌ రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఈ సిరీస్‌కు సన్నాహకంగా శ్రీలంక ఎలెవన్‌తో శుక్రవారం ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ఎలెవన్‌ రెండో రోజు ఆటలో 363 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. అనంతరం భారత జట్టు బ్యాటింగ్‌కు దిగింది.


జైస్వాల్‌ డకౌట్‌ ....

భారత ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ 67 బంతుల్లో 40 పరుగులు చేశాడు. అయితే కేశారా నువాంత బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయి పెవిలియన్‌ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన దేవదత్‌ పడిక్కల్‌ మాత్రం ధాటిగా బ్యాటింగ్‌ చేశాడు. 61 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ మరో 60 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఫోర్‌ బాది సెంచరీ పూర్తి చేసిన పడిక్కల్‌ 103 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి. పడిక్కల్‌ స్థానంలో రవీంద్ర జడేజాకు జతగా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ క్రీజులోకి వచ్చాడు.


పంత్‌ విఫలం ....

అయితే పంత్‌ స్వల్ప స్కోరుకే పెవిలియన్‌ చేరాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న అతడు రెండు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. 42 ఓవర్ల ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా 23 పరుగులతో క్రీజులో ఉండగా, ధ్రువ్‌ జురెల్‌ అతడికి జతయ్యాడు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్