నేడు ఎడ్జ్‌బాస్టన్‌లో మ్యాచ్.. మధ్యాహ్నం 3 గంటలకు టాస్, 3.30 గంటలకు ఆట ప్రారంభం
బర్మింగ్‌హామ్ : టి 20 సిరీస్‌లో ఎదురైన నిరాశను మరచి వన్డే సిరీస్‌లో విజయాలతో పుంజుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో మంగళవారం ఇంగ్లాండ్‌తో భారత్ తలపడనుంది. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది.
టి 20 సిరీస్ అనంతరం సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టులో చేరడంతో భారత బ్యాటింగ్‌కు బలం చేకూరింది. రానున్న 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‌ను భారత్ కీలకంగా భావిస్తోంది. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్పై జట్టు ఆశలు పెట్టుకుంది. అయితే యువ పేసర్ హర్షిత్ రాణా గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. మరోవైపు ... టి 20 సిరీస్‌లో విజయోత్సాహంతో ఉన్న ఇంగ్లాండ్ అదే జోరును వన్డేల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. హ్యారీ బ్రూక్ నాయకత్వంలోని జట్టులో జో రూట్, జోస్ బట్లర్ వంటి అనుభవజ్ఞులు బ్యాటింగ్ బలంగా నిలవగా, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్లతో బౌలింగ్ దళం పటిష్టంగా ఉంది.
మ్యాచ్ వివరాలు ....
మ్యాచ్ : భారత్ × ఇంగ్లాండ్ తొలి వన్డే
తేదీ : జూలై 14, 2026 (మంగళవారం)
వేదిక : ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్
టాస్ : మధ్యాహ్నం 3.00 గంటలకు (భారత కాలమానం)
మ్యాచ్ ప్రారంభం : మధ్యాహ్నం 3.30 గంటలకు
ప్రత్యక్ష ప్రసారం ....
భారత్‌లో ఈ మ్యాచ్‌ను సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఉచిత ప్రసారం డీడీ స్పోర్ట్స్లో అందుబాటులో ఉంటుంది. డిజిటల్ వేదికల్లో జియోహాట్‌స్టార్మ, సోనీలివ్ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.








కామెంట్‌లు (0)