మంగళవారం, 17 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆసియా మోడర్న్ పెంటాథ్లాన్ పోటీల్లో భారత్‌కు రజత పతకం

6 గంటల క్రితం

sas
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 16, 2026, 11:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- కృష్ణాజిల్లా క్రీడాకారుడు విజయ్ గోగులమూడి అద్భుత ప్రదర్శన

ప్రజాశక్తి - గన్నవరం (కృష్ణా జిల్లా) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని రస్ అల్ ఖైమాహ్ లో జరిగిన ఆసియా మోడరన్‌ పెంటాథ్లాన్ కప్ పోటీల్లో లేజర్ గన్ రన్ జట్టు విభాగంలో భారత జట్టు రజత పతకాన్ని కైవసం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ మోడరన్‌ పెంటాథ్లాన్ సంఘం ప్రధాన కార్యదర్శి కె.హరిబాబు సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు, కృష్ణా జిల్లా గన్నవరంకు చెందిన విజయ్ గోగులమూడి, ఒడిశా క్రీడాకారుడు అమన్ అద్భుత ప్రతిభ కనబరిచి దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చారని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా మన రాష్ట్రానికి చెందిన కృష్ణా జిల్లా క్రీడాకారుడు విజయ్ అత్యుత్తమ ప్రదర్శన చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దినఅంతర్జాతీయ స్థాయిలో రాణించిన విజయ్ గోగులమూడిని ఆంధ్రప్రదేశ్ మోడరన్‌ పెంటాథ్లాన్ సంఘం వ్యవస్థాపక సాంకేతిక అధికారి (ఫౌండర్ టెక్నికల్ అఫీషియల్) కె.కృష్ణయ్య, కార్యదర్శి కె.మౌనిక, కృష్ణా జిల్లా మోడర్న్ పెంటాథ్లాన్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణమోహన్ తదితరులు అభినందించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్