గురువారం, 05 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ విజేత భారత్‌

1 గంట క్రితం

హైదరాబాద్‌ను గెలిపించిన అనికేత్‌, రక్ష‍ణ్‌
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 05, 2026, 10:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • 6వ సారి టైటిల్‌ కైవసం

  • ఫైనల్లో జపాన్‌పై 4-1తో గెలుపు

జంషెడ్‌పూర్‌: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీ టైటిల్‌ను హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలోని భారతజట్టు కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో భారత్ 4-1గోల్స్‌ తేడాతో జపాన్‌ను చిత్తుచేసింది. దీంతో రికార్డుస్థాయిలో 6వ సారి ఈ టైటిల్‌ కైవసం చేసుకుంది. మ్యాచ్‌ ప్రారంభమైన మూడో నిమిషంలోనే జపాన్‌కు ఒక గోల్‌ సమర్పించుకొని 0-1తో వెనుకబడిన భారత జట్టుపై ఒత్తిడి పెరిగింది. జపాన్ నిరంతర దాడులు, అద్భుతమైన రక్షణ ఆతిథ్య జట్టును మరింత కష్టాల్లో నెట్టాయి. దీంతో రెండు క్వార్టర్లు ముగిసేసరికి జపాన్‌ 1-0 ఆధిక్యతలో నిలిచింది. ఈ క్రమంలో మూడో క్వార్టర్‌లో శిలానంద్ లక్రా గోల్ చేయడంతో భారత్‌ ఊపిరి పీల్చుకుంది. చివరి క్వార్టర్‌లో దిల్‌ప్రీత్ సింగ్, జుగ్రాజ్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్ తలా గోల్ చేసి విజయాన్ని ఖాయం చేయడంతో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. సెమీఫైనల్లో భారతజట్టు 8-0గోల్స్‌ తేడాతో కొరియా, జపాన్‌ 2-1తో మలేషియాను ఓడించి ఫైనల్‌కు చేరాయి. ఇక హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సారథ్యంలో భారత హాకీ జట్టు టోర్నీ ఆరంభం నుంచి అన్ని మ్యాచుల్లో గెలిచిం 6వ సారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. గ్రూప్‌ దశ తొలి లీగ్‌ మ్యాచ్‌ 13-0బంగ్లాదేశ్‌ను ఓడించిన భారత్‌.. 5-2తో చైనాపై, జపాన్‌పై 4-1తో, మలేషియాపై 4-2తో విజయాలను నమోదుచేసుకొని గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్