చెస్ ఒలింపియాడ్‌కు జట్టు ఇదే!
న్యూఢిల్లీ: 2026 చెస్ ఒలింపియాడ్‌లో భారత మహిళల జట్టుకు టాప్ ర్యాంక్ లభించింది. ఇక పురుషుల విభాగంలో అమెరికాకు అగ్రస్థానం లభించినా.. భారత్ రెండో ర్యాంక్‌లో నిలిచింది. ఈ రెండు విభాగాల్లోనూ భారత్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. కోనేరు హంపి, దివ్య దేశ్‌ముఖ్, ఆర్. వైశాలి, వంతిక అగర్వాల్ మరియు బి. సవిత శ్రీలతో భారత చెస్ జట్టు దుర్భేధ్యఫామ్‌లో ఉంది. ఇక పురుషుల 'ఓపెన్' విభాగంలో డి. గుకేష్, ఆర్. ప్రజ్ఞానంద, అర్జున్ ఎరిగైసి, నిహాల్ సరీన్ మరియు విదిత్ గుజరాతీ బలీయంగా ఉంది. పురుషుల జట్టులో ఒక మార్పు చోటుచేసుకోగా.. పి. హరికృష్ణ స్థానంలో నిహాల్ కు చోటు లభించింది. మహిళల బృందంలోనూ రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. డి. హారిక, తానియా సచ్‌దేవ్ స్థానాల్లో హంపి, సవిత జట్టులోకి వచ్చారు. ఓపెన్ విభాగంలో ఫాబియానో కరువానా, వెస్లీ సో మరియు లెవోన్ అరోనియన్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్న అమెరికా.. జవోఖిర్ సిందరోవ్, నోదిర్‌బెక్ అబ్దుసత్తరోవ్ మరియు నోదిర్‌బెక్ యాకుబ్బోయేవ్ వంటి ఆటగాళ్లతో ఆతిథ్య ఉబ్జెకిస్తాన్‌తో పాటు చైనా, జర్మనీ మరియు నెదర్లాండ్స్ జట్లు టైటిల్ రేసులో ఉన్నాయి. అమెరికా సగటు రేటింగ్ 2751 పాయింట్లు కాగా.. భారత్ 2733 రేటింగ్ పాయింట్లతో రెండోస్థానంలో ఉంది. మహిళల విభాగంలో, అగ్రశ్రేణి జట్టుగా ఉన్న భారత్‌కు రెండో సీడ్ జార్జియా, కజకిస్థాన్, చైనా, ఉక్రెయిన్ మరియు అమెరికా జట్ల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. మహిళల అగ్రశ్రేణి జట్టు భారత్ సగటు రేటింగ్ 2476 కాగా, జార్జియా సగటు రేటింగ్ 2449తో రెండోస్థానంలో ఉంది. చెస్ ఒలింపియాడ్ 11 రౌండ్లలో జరగనుంది. గత ఒలింపియాడ్‌లో గుకేశ్, అర్జున్, దివ్య మరియు వంతిక భారత్ తరపున వ్యక్తిగత స్వర్ణ పతకాలను గెలుచుకున్నారు. సెప్టెంబర్ 15 నుండి 28 వరకు ఉజ్బెకిస్తాన్‌లోని సమేకండ్‌లో చెస్ ఒలింపియాడ్-2026 టోర్నమెంట్ జరగనుంది.








కామెంట్‌లు (0)