- అదరకొట్టిన తెలుగు అమ్మాయిలు
ఒకాజాకి: మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. జ్యోతి సురేఖ వెన్నం, పృథిక ప్రదీప్, చికిత్సా తనిపర్తి సభ్యులుగా ఉన్న భారత జట్టు ఫైనల్లో చైనాపై విజయం సాధించింది. ఫైనల్లో భారత్ 238 పాయింట్లు సాధించగా, చైనా 234 పాయింట్లకే పరిమితమైంది. భారత్ నమోదు చేసిన 238 పాయింట్ల స్కోరు ప్రపంచ రికార్డును సమం చేయడం విశేషం. అద్భుతమైన ప్రదర్శనతో భారత ఆర్చర్లు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. జ్యోతి సురేఖ, చికితారావు తెలుగు అమ్మాయిలు కావడం విశేషం.
మహిళల టీమ్ స్క్వాష్‌లో, తన్వి ఖన్నా, అనాహత్ సింగ్‌లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించడంతో భారత్ త్వరలో మరో పతకంపై కన్నేసింది. పతకాల పట్టికలో భారత్ ఏడవ స్థానంలో ఉంది. రాబోయే మ్యాచ్‌లు తమ స్థాయిని పెంచుతాయని జట్టు సభ్యులు ఆశిస్తున్నారు.







కామెంట్‌లు (0)