బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionJapan Open :భారత షట్లర్లకు నిరాశ..

1 గంట క్రితం

Lakshya-Sen
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 10:25 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తొలి రౌండ్‌‌లో లక్ష్యసేన్‌, ఉన్నతి హుడా ఓటమి

టోక్యో: జపాన్‌ ఓపెన్‌ ‌బ్యాడ్మింటన్‌ ‌టోర్నీలో భారత షట్లర్లకు నిరాశ తప్పలేదు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ ‌పోటీలో లక్ష్యసేన్‌‌, ఆయుశ్‌ ‌శెట్టితోపాటు ఉన్నతి హుడా తొలిరౌండ్‌‌లోనే ఇంటిదారి పట్టారు. లక్ష్యసేన్‌ 16-21, 14-21తో కొకీ వాటెనాబీ(జపాన్‌) ‌చేతిలో, ఆయుశ్‌ ‌శెట్టి 19-21, 25-23, 15-21తో 2వ సీడ్‌, విదిత్‌‌శరణ్‌(‌మలేషియా) చేతిలో పోరాడి ఓడారు. ఇక మహిళల సింగిల్స్‌‌లో ఉన్నతి హుడా 21-16, 16-21, 15-21తో హుండ్‌ ‌యూసిన్‌ ‌చేతిలో పోరాడి ఓటమిపాలైంది. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌‌లో పివి సింధు విజయం సాధించి రెండోరౌండ్‌‌కు చేరగా.. పురుషుల డబుల్స్‌‌లో సాత్విక్‌-చిరాగ్‌ ‌జంట గాయం కారణంగా తొలిరౌండ్‌‌లో తొలి సెట్‌ ఓటమితర్వాత వైదొలిగిన సంగతి తెలిసిందే.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్