మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionJapan Open: సింధు శుభారంభం

4 గంటల క్రితం

pv sindhu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 14, 2026, 10:38 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • గాయంతో వైదొలిగిన సాత్విక్‌-చిరాగ్‌

టోక్యో: జపాన్‌ ఓపెన్‌ ‌బ్యాడ్మింటన్‌ ‌టోర్నీలో పివి సింధు శుభారంభం చేయగా.. స్టార్‌ ‌షట్లర్లు సాత్విక్‌-చిరాగ్‌ ‌జంట తొలిరౌండ్‌‌లోనే ఇంటిదారి పట్టింది. మంగళవారం జరిగిన తొలిరౌండ్‌ ‌పోటీలో సింధు 21-14, 21-11తో వరుససెట్లలో మలేషియాకు చెందిన వాంగ్‌ ‌లింగ్‌ ‌చింగ్‌‌ను ఓడించింది. తొలి సెట్‌‌లో దూకుడుగా ఆడిన 10వ ర్యాంకర్‌ ‌సింధు.. రెండో సెట్‌‌లో మరింత దూకుడుగా ఆడి మ్యాచ్‌‌ను ముగించింది. టోర్నీ టైటిల్‌ ఫేవరెట్ సాత్విక్ సాయిరాజ్‌- చిరాగ్ శెట్టి జంట 19-21తో తొలి సెట్‌‌ను ఓడిన తర్వాత సాత్విక్ సాయిరాజ్‌కు భుజం గాయం తిరగబెట్టడంతో టోర్నీ నుంంచి వైదొలిగారు. దాంతో.. డెన్మార్క్ జంటను విజేతగా ప్రకటించారు నిర్వాహకులు. మిక్స్‌‌డ్‌ ‌డబుల్స్‌‌లో ధృవ్‌ ‌కపిల, తానీసా కాస్ట్రో జంట 21-16, 21-14తో స్కాట్లాండ్‌ ‌జంటను చిత్తుచేసి రెండోరౌండ్‌‌కు చేరారు. మరో మిక్స్‌‌డ్‌ ‌డబుల్స్‌‌లో రోహన్‌ ‌కపూర్‌-‌రుత్విక శర్వాని గద్దే జంట 11-21, 10-21తో చైనా షట్లర్ల చేతిలో ఓడారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్