మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై కపిల్ దేవ్ స్పందన

3 రోజుల క్రితం

Kapil Devs reaction to Siraj not getting a place
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 21, 2026, 11:53 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

సెలక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నించలేం.. జట్టు ప్రయోజనాలే ముఖ్యం


న్యూఢిల్లీ : న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేసర్ మహమ్మద్ సిరాజ్‌ కు తుది జట్టులో చోటు దక్కకపోవడంపై వివాదం కొనసాగుతోంది. సిరాజ్‌ను అతడి పేరు కారణంగా జట్టులోకి తీసుకోలేదంటూ కాంగ్రెస్ ఎంపి ఇమ్రాన్ మసూద్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. దీనిపై బిజెపి నేతలు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అభ్యంతరం వ్యక్తం చేశారు. క్రీడల్లో మతపరమైన అంశాలను తీసుకురావడం సరికాదని చెప్పారు. ఈ నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఈ వివాదంపై స్పందించారు. సిరాజ్ ఎంపిక విషయంలో తాను కానీ, తనలాంటి వారు కానీ వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. సెలక్షన్ కమిటీ తన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తోందని, ప్రతి ఒక్కరినీ సంతృప్తిపరచడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. వ్యవస్థను అనవసరంగా విమర్శించకూడదని, ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు మంచి ప్రదర్శన చేస్తోందని కపిల్ పేర్కొన్నారు. వ్యక్తిగతంగా సిరాజ్ అంటే తనకు ఇష్టమని చెప్పిన ఆయన.. తుది జట్టులో ఎవరుండాలనేది సెలక్టర్లు, జట్టు యాజమాన్యం, కెప్టెన్ సమష్టిగా తీసుకునే నిర్ణయమని స్పష్టం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాల కంటే జట్టు వ్యూహాలకే ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. మరోవైపు పిచ్ స్వభావం, ఐదు రోజుల ఆట పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే పేస్ విభాగాన్ని ఎంపిక చేసినట్లు భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ వెల్లడించారు. బుమ్రా, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, అన్షుల్ కంబోజ్‌లకు అవకాశం కల్పించడాన్ని సమర్థించుకున్నారు. అయితే సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి, సునీల్ గావస్కర్, రవిచంద్రన్ అశ్విన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్