మంగళవారం, 24 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కోహ్లీ ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండాల్సింది : కపిల్ దేవ్

17 నవంబర్, 2026

Kohli should not have taken that decision Kapil Dev
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 17, 2026, 12:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌ కు రిటైర్మెంట్ ప్రకటించడం పై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టెస్టుల నుంచి తప్పుకోవడం కోహ్లీ కెరీర్‌లో తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయమని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. అతడి శారీరక దృఢత్వం, ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుంటే మరికొన్నేళ్ల పాటు టెస్టు క్రికెట్‌లో కొనసాగి అద్భుతంగా రాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోహ్లీ తన నిర్ణయంపై భవిష్యత్తులో తప్పకుండా పశ్చాత్తాపపడతారని కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. 25 ఏళ్ల యువ క్రికెటర్‌తో పోటీపడగల స్థాయి ఫిట్‌నెస్ కోహ్లీ సొంతమని కొనియాడారు. ఆవేశంలో ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం సరికాదని సూచించారు. ఈ సందర్భంగా మాజీ క్రికెటర్ మొహిందర్ అమర్‌నాథ్‌ను కపిల్ ఉదాహరణగా ప్రస్తావించారు. ఎన్నోసార్లు జట్టులో స్థానం కోల్పోయినప్పటికీ, పట్టుదలతో మళ్లీ జట్టులోకి వచ్చి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని గుర్తు చేశారు. కాగా ... 2025 మే లో కోహ్లీ టెస్టు క్రికెట్ ‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతకుముందే టి 20 ఫార్మాట్‌కు కూడా వీడ్కోలు పలికిన అతడు ... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 74 పరుగులు చేసిన కోహ్లీ ... ఆ తర్వాతి మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు 13 ఇన్నింగ్స్‌ల్లో 638 పరుగులు సాధించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్