- క్వార్టర్‌ఫైనల్లో ఓడిన శ్రీకాంత్
- జపాన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ
టోక్యో: జపాన్ మాస్టర్స్ సూపర్-500 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లోకి లక్ష్య సేన్ దూసుకెళ్లగా.. సంచలన విజయాలతో క్వార్టర్స్‌కు చేరిన కిదాంబి శ్రీకాంత్ సంచలన పోరాటానికి తెర పడింది. శుక్రవారం జరిగిన సింగిల్స్‌లో 13వ సీడ్ లక్ష్య సేన్ 21-16, 21-15తో జపాన్‌కు చెందిన యుషీ టనకాను చిత్తుచేయగా.. 2021 బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్ రజత పతక విజేత కిదాంబి శ్రీకాంత్ 22-24, 15-21తో ప్రపంచ 15వ ర్యాంకర్ వటనాబే చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్‌లో జపాన్ షట్లర్ ఒక దశలో 17-14పాయింట్ల ఆధిక్యతలో నిలిచినా.. ఆ తర్వాత శ్రీకాంత్ పుంజుకొని 17-17తో స్కోర్‌ను సమం చేశాడు. ఆ తర్వాత 22-21తో వటనబే మరోసారి ఆధిక్యతలో దూసుకెళ్లి వరుసగా రెండు పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో తొలి అర్ధభాగం ముగిసేసరికి వటనాబే 14-9పాయింట్లతో ఆధిక్యతలో నిలిచాడు శ్రీకాంత్ 14పాయింట్లకు చేరేసరికి వటనాబే 19పాయింట్లతో ముందంజలో నిలిచాడు. సెమీఫైనల్లో లక్ష్య సేన్ 6వ సీడ్, ప్రపంచ 10వ ర్యాంకర్, ఇండోనేషియాకు చెందిన అల్వీ ఫర్హాన్‌తో తలపడనున్నాడు.








కామెంట్‌లు (0)