డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ శెట్టి కూడా
హాంకాంగ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ
హాంకాంగ్: హాంకాంగ్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల విభాగంలో లక్ష్యసేన్ తోపాటు డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా.. మహిళల సింగిల్స్‌లో రక్షిత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-17, 10-21, 13-21తో 8వ ర్యాంకర్, సింగపూర్‌కు చెందిన లో కెన్ వూయ్‌ను చిత్తుచేయగా.. పురుషుల డబుల్స్‌లో 5వ ర్యాంకర్ జోడీ, భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 21-12, 13-21, 21-16తో చైనాకు చెందిన హు కెన్ యు-లిన్-షి హిలను ఓడించి సెమీస్‌కు చేరారు. ఈ మ్యాచ్ సుమారు గంటసేపు సాగింది. ఇక డబుల్స్ సెమీస్‌లో సాత్విక్- చిరాగ్, ఫైనల్‌లో చోటు కోసం డెన్మార్క్‌కు చెందిన డేనియల్ లండ్‌గార్డ్ - మాడ్స్ వెస్టర్‌గార్డ్ జోడీతో లేదా మలేషియాకు చెందిన ఎనిమిదో సీడ్ జంట మాన్ వీ చోంగ్ - టీ కై వున్‌లతో తలపడనున్నారు. ప్రీ క్వార్టర్ ఫైనల్లో రక్షితశ్రీ సంతోష్ రామ్‌రాజ్, కిదాంబి శ్రీకాంత్ ఓటమిపాలయ్యారు. రక్షితశ్రీ 19-21, 16-21తో థాయ్‌లాండ్‌కు చెందిన 5వ ర్యాంకర్ ఛోఛువాంగ్ చేతిలో, కిదాంబి శ్రీకాంత్ 17-21, 7-21తో 2వ ర్యాంకర్, థాయ్‌లాండ్‌కు చెందిన విదిత్ శరణ్ చేతిలో ఓటమిపాలయ్యారు.








కామెంట్‌లు (0)