ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : మండలంలోని మడికికి చెందిన ఉండ్రాసపు సుందర విజయ్ కుమారుడు ఉండ్రాసపు విలియం కేరీ భారత క్రీడా రంగంలో అరుదైన ఘనత సాధించాడు. హిందుస్థాన్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న విలియం కేరీ, భారత అండర్-15 గోల్ షాట్ బాల్ జట్టుకు ఎంపికై తన ప్రతిభను చాటుకున్నాడు. ఇటీవల గోల్ షాట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన అధికారిక జాబితాలో విలియం కేరీ చోటు దక్కించుకున్నాడు. భారత్ తరఫున భూటాన్‌తో జరిగే ఇంటర్నేషనల్ గోల్ షాట్ బాల్ ఛాంపియన్‌షిప్–2026లో ఆగస్టు 24న జరిగే మ్యాచ్‌లో పాల్గొననున్నాడు. ఇదే అతని తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. చిన్న వయస్సులోనే క్రమశిక్షణతో సాధన చేస్తూ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన విలియం కేరీ ఆలమూరు మండలంలోని మడికికి, కోనసీమ జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. అతని కృషి, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఈ విజయానికి బలమైన పునాది అయ్యాయని గ్రామస్థులు అభిప్రాయ పడుతున్నారు. ఈ సందర్భంగా విలియం కేరీకి గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు, ఉపాధ్యాయులు, స్నేహితులు, పలువురు ప్రజాప్రతినిధులు అభినందనలు తెలియజేస్తూ, అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి విజయాన్ని అందించాలని ఆకాంక్షించారు. భారత జెండాను మరింత ఎత్తుకు ఎగరవేసి స్వర్ణ పతకం సాధించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక విలేకరులకు శనివారం వారు తెలిపారు.
అంతర్జాతీయ గోల్ షాట్ బాల్ జట్టుకు మడికి కుర్రాడు కేరీ ఎంపిక
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 25, 2026, 05:29 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)