బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

బ్లాక్ లో మ్యాచ్ టిక్కెట్లు - హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్

1 గంట క్రితం

Match tickets sold in the black market – Hyderabad Cricket Association members arrested.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 14, 2026, 11:13 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

హైదరాబాద్ : హైదరాబాద్‌లో భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం నాలుగో టి 20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు సంబంధించి కాంప్లిమెంటరీ టికెట్లను అక్రమంగా బ్లాక్‌లో విక్రయిస్తున్న ముఠా గుట్టును గోషామహల్ పోలీసులు రట్టు చేశారు.


హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సభ్యుడు సతీష్ చంద్ర శ్రీవాస్తవ తన కుమారుడు ఆకర్షిత్ శ్రీవాస్తవ ద్వారా ‘నాట్ ఫర్ సేల్’ పాస్‌లను ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వేదికగా భారీ ధరకు విక్రయిస్తున్నట్లు నిర్థారణ అయ్యింది. హెచ్‌సీఏ (HCA) మెంబర్ ద్వారా కాంప్లిమెంటరీ టికెట్లు సేకరించి బ్లాక్‌లో విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బేగంబజార్‌లోని ఎస్‌డీ మాల్ సమీపంలో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. సతీష్ చంద్ర శ్రీవాస్తవ, ఆయన కుమారుడితోపాటు మరో ఇద్దరు నిందితులు అవినాష్ దరక్, మోహిత్ సోమానీలను అరెస్ట్ చేశారు. వారి నుంచి 11 మ్యాచ్ టికెట్లు, 8 దాండియా పాస్‌లు, నగదు, ఓ స్కూటర్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ – వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా నేడు నాలుగో టి 20 మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు బ్యాటర్లదే ఆధిపత్యం ఉండగా, ఉప్పల్ పిచ్‌ను కొత్త మట్టితో పునరుద్ధరించడం వల్ల బ్యాటర్లు ఆచితూచి ఆడాల్సి రావచ్చు. రాత్రి 7 గంటల సమయానికి ప్రారంభమయ్యే ఈ ఆట లో శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా ఐదో సిరీస్ విజయంపై గురిపెట్టింది. భారత జట్టులో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డిలకు స్థానిక పిచ్‌పై మంచి అవగాహన ఉండటం అదనపు బలం కాగా, పేసర్ మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ విండీస్ బ్యాటర్లను కట్టడి చేయడానికి సన్నద్ధమయ్యారు. విండీస్‌లో పవర్ హిట్టర్లు ఉన్నప్పటికీ, సొంతగడ్డపై ఆడుతున్న భారతే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. టాస్, మంచు ప్రభావం ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది. గతంలో ఇక్కడ భారత్ భారీ స్కోరు సాధించిన జ్ఞాపకాలు ఉండటంతో, నేడు కూడా పరుగుల వరద పారే అవకాశం ఉంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్