గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Edition53కిలోల విభాగానికి మీరాభాయి చాను

1 గంట క్రితం

mirabai chanu.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 09:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • వెయిట్‌లిఫ్టింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ బరిలోకి...

నింగ్‌బో (చైనా): భారత స్టార్‌ మహిళా వెయిట్‌ లిఫ్టిర్‌ మీరాభాయి ఛాను 48/49 కిలోల విభాగం నుంచి 53కిలోల విభాగంలోకి అడుగుపెట్టబోతోంది. 2028 లాస్‌ ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌లో 48/49 విభాగాన్ని తీసేయడంతో మీరాభాయి 53 కిలోల విభాగానికి మారాల్సి వచ్చింది. ఇందుకోసం బరువు పెరిగిన మీరా.. కొత్త విభాగానికి తగ్గట్లు ఇప్పటికే సాధన కూడా చేసింది. తొలి పరీక్ష‍గా ఐడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బరిలోకి మీరాభాయి 53కిలోల విభాగంలో పోటీ పడనుంది. ఆమెతో పాటు జ్ఞానేశ్వరి యాదవ్‌ కూడా ఇదే విభాగంలో బరిలోకి దిగుతోంది. నిరుపమ దేవి, ఉష 61 కేజీల్లో పోటీపడనున్నారు. పురుషుల విభాగంలో లవ్‌ప్రీత్‌ సింగ్‌ (110 కేజీలు) ఒక్కడే బరిలో ఉన్నాడు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్