శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం

1 గంట క్రితం

arw
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 13, 2026, 10:12 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- రాష్ట్రపతి చేతుల మీదుగా 15 మందికి అర్జున అవార్డుల అందజేత

న్యూఢిల్లీ: క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు, కోచ్‌లకు ఇచ్చే జాతీయ క్రీడా పురస్కారాల-2025 ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విజేతలకు అవార్డులు అందజేసి సత్కరించారు. డెకాథ్లాన్ అథ్లెట్ తేజస్విన్ శంకర్, ఫిడే మహిళల ప్రపంచ కప్ విజేత దివ్య దేశ్‌ముఖ్‌తో పాటు మొత్తం 15 మంది క్రీడా పురస్కారాలు అర్జున అవార్డులను అందుకున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో డెకాథ్లాన్‌లో కాంస్య పతకం సాధించి, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా తేజస్విన్ శంకర్ చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా ఫిడే మహిళల ప్రపంచ కప్-2025 గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా దివ్య దేశ్‌ముఖ్ రికార్డు సృష్టించింది. వీరితో పాటు అథ్లెట్ మహమ్మద్ అజ్మల్, బాక్సర్ నరేందర్, చెస్ ప్లేయర్ విదిత్ గుజరాతి, హాకీ క్రీడాకారులు లాల్రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్ సహా పలువురు క్రీడాకారులు అర్జున పురస్కారాన్ని అందుకున్నారు. మహిళల బ్యాడ్మింటన్ డబుల్స్ జోడీ త్రీసా జాలీ, పుల్లెల గాయత్రి గోపీచంద్ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. సీనియర్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు యెషయా అరుమైనియాగం 'అర్జున అవార్డు (జీవితకాల సాఫల్యం), అత్యుత్తమ కోచ్‌లకు అందించే ద్రోణాచార్య అవార్డును అథ్లెటిక్స్ కోచ్ పర్వీర్ సింగ్, బాక్సింగ్ కోచ్‌లు ఛోటే లాల్ యాదవ్, ధర్మేంద్ర సింగ్ యాదవ్, షూటింగ్ కోచ్ నేహా నందకుమార్ చవాన్, రెజ్లింగ్ కోచ్ వీరేంద్ర కుమార్‌లకు ప్రదానం చేశారు. సాహస క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన టెన్జింగ్ నార్గే జాతీయ సాహసపురస్కారాన్ని అందుకున్నారు. పుణెలోని ఆర్మీ పారాలింపిక్ నోడ్‌కు 'రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్' లభించింది. లెఫ్టినెంట్ కల్నల్ దల్జీత్ సింగ్ రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సిఫార్సుల మేరకు క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది ఆగస్టు 18న అవార్డు గ్రహీతల తుది జాబితాను ప్రకటించింది. ప్రతి ఏటా ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా ఆగస్టు 29న ఈ అవార్డుల ప్రదానం జరగాల్సి ఉండగా.. వాయిదాపడి ఇప్పుడు అవార్డులను ఇప్పుడు ప్రదానం చేయడం జరిగింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్