శనివారం, 31 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పాక్‌ విజయంపై ప్రధాని షరీఫ్‌ స్పందన.. నెట్టింట నెటిజన్ల ట్రోలింగ్‌ !

5 గంటల క్రితం

PM Sharifs reaction to Pakistans victory draws trolling from netizens online
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 31, 2026, 10:13 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

పాకిస్థాన్ : భారత్‌ పై పాకిస్థాన్ సాధించిన విజయంపై ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఓ చిన్న టోర్నమెంట్‌లో సాధించిన విజయానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.


హాంకాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో శుక్రవారం భారత్‌, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూప్ దశలో నమోదైన ఈ గెలుపుపై పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ స్పందించారు. భారత జట్టుపై అద్భుత విజయం సాధించిన పాక్ ఆటగాళ్లకు అభినందనలు తెలిపారు. మంచి పోరాటం కనబరిచారని ప్రశంసించారు. అలాగే జట్టుకు మద్దతుగా నిలిచిన పీసీబీ ఛైర్మన్ మోసిన్ నఖ్వీ, ఆయన బృందాన్ని కూడా అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.


అయితే, ఈ విజయంపై ప్రధాని స్థాయిలో ఇంతటి స్పందన అవసరమా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. హాంకాంగ్ సిక్సెస్‌ను గల్లీ క్రికెట్‌తో పోలుస్తూ, చిన్న టోర్నమెంట్‌లో గెలుపునకు ఇంత హడావుడి ఎందుకని వ్యాఖ్యానిస్తున్నారు.

- ఇది చిన్న టోర్నమెంట్ మాత్రమే.. ఇంత ప్రచారం అవసరమా?

- హాంకాంగ్ సిక్సెస్ విజయంపై ప్రధాని స్పందించడం ఆశ్చర్యంగా ఉంది.

- ఆసియా కప్‌, ప్రపంచకప్‌ల కంటే ఈ టోర్నమెంట్‌లో గెలుపే గొప్పగా మారిందా?

- ఈ ఘన విజయానికి వారం రోజుల సెలవులు ప్రకటించాలంటూ వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు.

పాక్ ప్రధాని చేసిన పోస్టు నేపథ్యంలో సోషల్ మీడియాలో భారత్‌-పాక్ క్రికెట్ అభిమానుల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్