2వ ర్యాంకర్ చెన్-యూఫీపై కెరీర్ బెస్ట్ గెలుపు
క్వార్టర్స్‌కు లక్ష్యసేన్... వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత
హాంకాంగ్: మహిళల సింగిల్స్‌లో రష్మిక శ్రీసంతోష్ సామ్రాజ్ పెను సంచలనాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో ఏకంగా 2వ ర్యాంకర్‌కు ఝలక్ ఇచ్చి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. ప్రీ క్వార్టర్‌లో రష్మిక 21-18, 24-22తో చైనా షట్లర్ చెన్-యూఫీను చిత్తుచేసి పెను సంచలనానికి తెరలేపింది. ఇక పురుషుల సింగిల్స్‌లో యువ షట్లర్ లక్ష్యసేన్.. క్వార్టర్ ఫైనల్‌కు చేరి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌కు అర్హత సాధించగా.. మాజీ నంబర్‌వన్ ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ మూడు సెట్ల హోరాహోరీ పోరులో ప్రత్యర్ధిని చిత్తుచేసి క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు. హాంకాంగ్ ఓపెన్ సూపర్–500 టోర్నీలో క్వార్టర్‌ఫైనల్‌కు చేరడంతో లక్ష్యసేన్‌కు ఈ ఛాన్స్ దక్కింది. గురువారం జరిగిన పురుషుల ప్రీ క్వార్టర్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-11, 21-16తో రాస్మస్ జెంకే(డెన్మార్క్)ను ఓడించాడు. ఈ మ్యాచ్ కేవలం 38 నిమిషాల్లోనే ముగిసింది. ఇక పురుషుల డబుల్స్‌లో 5వ ర్యాంకర్స్ చిరాగ్‌శెట్టి-సాత్విక్ సాయిరాజ్ జంట 21-19, 21-16తో మలేషియా జంటను ఓడించారు. ఇక మహిళల సింగిల్స్‌లో అస్మిత చాలీహా పోరాటం ముగిసింది. గురువారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో అస్మిత 17-21, 12-21తో జపాన్‌కు చెందిన హినా అరెచీ చేతిలో వరుససెట్లలో పరాజయాన్ని చవిచూసింది. ఇక మహిళల డబుల్స్‌లో త్రీసా జోలీ-గాయత్రి గోపీచంద్ జంట కూడా ప్రీ క్వార్టర్స్‌లో ఇంటిదారి పట్టింది. అమెరికాకు చెందిన అన్‌సీడెడ్ లారెన్ లామ్, అలీసన్ జంట చేతిలో 20-22, 13-21తో ఓటమిపాలయ్యారు. కిదాంబి శ్రీకాంత్ 12-21, 21-18, 21-14తో కొరియాకు చెందిన యో-టి-బిన్‌ను ఓడించాడు.








కామెంట్‌లు (0)