శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వివాన్‌కు రజతం

6 గంటల క్రితం

వివాన్‌కు రజతం
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 12, 2026, 10:44 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • షూటింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌

దోహా: 24ఏళ్ల వివాన్‌ కపూర్‌ ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించడంతోపాటు ఒలింపిక్‌ బెర్త్‌ కూడా దక్కించుకున్నాడు. దోహా వేదికగా జరుగుతున్న ప్రపంచ షూటింగ్‌ ఛాంపియన్‌ షిప్‌ పురుషుల ట్రాప్‌ ఈవెంట్‌లో వివాన్‌ 30కి 29 పాయింట్లు సాధించాడు. కానీ షూట్‌ ఆఫ్‌లో కువైట్‌కు చెందిన అబ్దుల్‌ రెహ్మాన్‌ అల్ఫైహాన్‌ చేతిలో ఓటమిపాలై రెండో స్థానానికి పరిమితమయ్యాడు. తొలి మూడు స్థానాల్లో నిలిచిన షూటర్లకు 2028 లాస్‌ఏంజెల్స్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌లు దక్కనున్నాయి. ఫైనల్లో వివాన్‌ తొలుత అగ్రస్థానంలో నిలిచినా.. చివరి సిరీస్‌లో లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యాడు. స్వర్ణ పతకం కోసం జరిగిన షూట్-ఆఫ్‌లో, అతను తన మూడవ ప్రయత్నంలో లక్ష్యాన్ని తాకలేకపోయాడు. భారత్‌కే చెందిన మరో షూటర్‌ ఉదయ్‌వీర్ సింగ్ జైజీ 11 పాయింట్లతో ఫైనల్‌లో ఆరో స్థానంలో నిలిచి నిరాశపరిచాడు. టర్కీకి చెందిన యావుజ్ ఇల్నామ్‌ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా.. చైనాకు చెందిన క్వి యింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. ఐఎస్‌ఎస్‌ఎస్‌ షూటింగ్‌ పోటీల్లో వివాన్‌కు ఇది ఆరో పతకం. అలాగే ఐదవ రజత పతకం. అతను జూనియర్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కూడా రజత పతకాన్ని, జూనియర్ ప్రపంచ కప్‌లో ఒక రజత మరియు ఒక కాంస్య పతకాన్ని సాధించాడు. అలాగే ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో పురుషుల ట్రాప్ విభాగంలో భారత్‌కు ఇది నాలుగో పతకం. కైరోలో జరిగిన గత ఎడిషన్‌లో జోరవర్ సింగ్ సంధు కాంస్యం గెలిచాడు. ఇంతకుముందు 2006లో జాగ్రెబ్‌లో మానవ్‌జీత్ సింగ్ సంధు స్వర్ణం గెలుచుకోగా, కైరోలోనే జరిగిన 1962 ఛాంపియన్‌షిప్‌లలో కర్ణి సింగ్ రజతం సాధించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్