గురువారం, 20 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionBWF World Championships: ప్రీ క్వార్టర్స్‌‌కు సింధు, ఆయుశ్‌

19 గంటల క్రితం

sindhu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 19, 2026, 09:19 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • లక్ష్యసేన్‌ ఓటమి

  • రెండోరౌండ్‌‌కు సాత్విక్‌-‌చిరాగ్‌

  • బిడబ్ల్యూఎఫ్‌ ‌ప్రపంచ ఛాంపియన్‌‌షిప్స్‌

న్యూఢిల్లీ: బిడబ్ల్యూఎఫ్‌ ‌ప్రపంచ ఛాంపియన్‌‌షిప్స్‌ సింగిల్స్‌‌లో భారత్‌‌కు మిశ్రమ ఫలితాలు దక్కాయి. సింగిల్స్‌‌లో ఆయుశ్‌ ‌శెట్టి, పివి సింధు విజయం సాధించి ప్రీ క్వార్టర్‌‌ఫైనల్‌‌కు చేరగా.. లక్ష్యసేన్‌ అనూహ్యంగా 18ఏళ్ల అమెరికా ఆటాడు చేతిలో ఓటమిపాలయ్యాడు. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన రౌండ్‌-32 మహిళల సింగిల్స్‌‌లో పివి సింధు 21-16, 21-17తో కెనడాకు చెందిన ప్రపంచ 49వ ర్యాంకర్‌ ‌వెన్‌-‌జు-జంగ్‌‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌‌ను సింధు కేవలం 34 నిమిషాల్లోనే ముగించింది. అలాగే ముఖాముఖి పోరులో కెనడా షట్లర్‌‌పై 3-0 ఆధిక్యతలో నిలిచింది. గత ఏడాది పారిస్‌లో జరిగిన టోర్నమెంట్‌లో సింధు 21-19, 21-15 వాంగ్‌‌పై విజయం సాధించింది. ఇక పురుషుల సింగిల్స్‌‌లో ఆయుష్ శెట్టి కూడా వరుససెట్లలోనే ప్రత్యర్ధిని చిత్తుచేసి రౌండ్‌-16కు చేరుకున్నాడు. 2021 బిడబ్ల్యూఎఫ్‌ ‌ప్రపంచ ఛాంపియన్‌‌షిప్స్‌‌ కాంస్య పతక విజేత లక్ష్యసేన్‌.. అమెరికాకు చెందిన 18 ఏళ్ల గారెట్ టాన్ చేతిలో 19-21, 21-19, 21-17 తేడాతో ఓటమిపాలయ్యాడు. ఈ మ్యాచ్‌ ‌సుమారు 73 నిమిషాల పాటు ఉత్కంఠభరితంగా సాగింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాన్‌ 92వ స్థానంలో ఉండగా.. లక్ష్యసేన్‌ ‌14వ సీడ్ ఆటగాడు. అంతకుముందు జరిగిన రౌండ్‌-32లో ప్రపంచ ర్యాంకింగ్‌లో 22వ ర్యాంకర్‌ ఆయుష్ శెట్టి 21-8, 21-10 తేడాతో కేవలం 26 నిమిషాల్లోనే శ్రీలంక ఆటగాడు దుమిందు అబేవిక్రమపై విజయం సాధించాడు. తొలి ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లోనే టాప్ సీడెడ్, డిఫెండింగ్ ఛాంపియన్ చైనా ఆటగాడు షి యు క్విని ఓడించిన ఆయుశ్‌ ‌శెట్టి.. క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం కోసం 11వ సీడెడ్ ఇండోనేషియా ఆటగాడు అల్వి ఫర్హాన్‌తో తలపడనున్నాడు. ఇక భారత పురుషుల జోడీ సాత్విక్‌-‌చిరాగ్‌ ‌శెట్టి రెండోరౌండ్‌‌కు చేరారు. స్కాట్లాండ్‌కు చెందిన అలెగ్జాండర్ డన్, ఆడమ్ ప్రింగిల్ తో బుధవారం జరగాల్సిన తొలి మ్యాచ్ నుంచి వైదొలగడంతో వీరు తదుపరి రౌండ్‌కు చేరుకున్నారు. రెండోరౌండ్‌‌లో భారత్‌‌కు చెందిన ఐదో సీడ్‌ సాత్విక్‌-‌చిరాగ్‌ ఇండోనేషియాకు చెందిన 12వ సీడ్ రేమండ్ ఇంద్ర, నికోలస్ జోక్విన్‌లతో తలపడనున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్