జపాన్ ఓపెన్ సూపర్ 750
టోక్యో (జపాన్) : భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ జపాన్ ఓపెన్ 2026 టోర్నమెంట్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇవాళ జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన ప్రపంచ 4వ ర్యాంకర్, మాజీ ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యుఫెయ్ గాయం కారణంగా మధ్యలోనే వైదొలగడంతో సింధు విజయం సాధించింది. ఈ విజయంతో సింధు ఈ సీజన్‌లో తొలిసారి ఒక టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరింది.
తొలి గేమ్‌లో సింధు ఒత్తిడిని జయించి, నిలకడగా ఆడి తొలి గేమ్‌ను 21-19 తేడాతో కైవసం చేసుకుంది. రెండో గేమ్‌లోనూ సింధు అదే జోరు కొనసాగించింది. 15-10 ఆధిక్యంలో ఉన్న సమయంలో, తొడ కండరాల గాయంతో బాధపడుతున్న చెన్ యుఫెయ్ ఆటను కొనసాగించలేక రిటైర్డ్ హర్ట్‌గా వైదొలిగింది. దీంతో సింధు ఫైనల్‌కు చేరినట్లు అంపైర్లు ప్రకటించారు. రెండేళ్ల తర్వాత ఓ ఫైనల్‌కు చేరడం సింధుకు ఇదే తొలిసారి. చివరిసారి 2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ విజేతగా సింధు నిలిచింది.








కామెంట్‌లు (0)