మంగళవారం, 04 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసింధుకు 9వ ర్యాంక్‌

4 గంటల క్రితం

pv-sindhu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 04, 2026, 10:08 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ: భారత స్టార్‌ షట్లర్లకు ప్రతిష్టాత్మక బిడబ్లూఎఫ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ 2026కు ముందు సీడింగ్‌ ఖరారైంది. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీ.వీ. సింధుకు మహిళల సింగిల్స్‌లో 9వ సీడ్‌ లభించింది. పురుషుల డబుల్స్‌ జోడీ సాత్విక్‌సాయిరాజ్‌ రంకిరెడ్డి-చిరాగ్‌ శెట్టికి 5వ సీడ్‌ దక్కింది. ఆగస్టు 17 నుంచి 23 వరకు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బిడబ్లూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ జరగనుంది. భారత్‌ ఐదు విభాగాల్లోనూ రెండేసి ఎంట్రీలు నమోదు చేసింది. నాలుగు విభాగాల్లో కనీసం ఒక భారత జోడీ లేదా ఆటగాడికి సీడింగ్‌ దక్కడం విశేషం. జపాన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌గా నిలిచిన సింధు ర్యాంక్‌ ‌మెరుగైంది. జపాన్‌కు చెందిన అకానె యమగుచి 2వ సీడ్‌గా ఉండగా, చైనాకు చెందిన వాంగ్‌ జి యి, చెన్‌ యుఫెయ్‌ వరుసగా 3, 4వ సీడ్లలో ఉన్నారు. దక్షిణ కొరియా స్టార్‌ ఆన్‌ సె-యంగ్‌ మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌గా ఉంది. పురుషుల డబుల్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన కిమ్‌ వోన్‌ హో-సియో సియుంగ్‌ జే టాప్‌ సీడ్‌గా ఉన్నారు. భారత యువ స్టార్‌ లక్ష్య సేన్‌ పురుషుల సింగిల్స్‌లో 14వ సీడ్‌గా నిలిచాడు. గతంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించిన లక్ష్య.. మరోసారి పతకంపై కన్నేశాడు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ ఛాంపియన్‌ షి యు కీ టాప్‌ సీడ్‌గా ఉన్నాడు. మిక్స్‌‌డ్‌ ‌డబుల్స్‌‌లో ధ్రువ్‌ కపిల-తనిషా క్రాస్టో జోడీ 15వ సీడ్‌గా నిలిచింది. ఈ విభాగంలో చైనాకు చెందిన ఫెంగ్‌ యాన్‌ ఝె-హువాంగ్‌ డాంగ్‌ పింగ్‌ టాప్‌ సీడ్‌గా ఉన్నారు. మరోవైపు మహిళల డబుల్స్‌లో చైనాకు చెందిన లియూ షెంగ్‌ షు-టాన్‌ నింగ్‌ టాప్‌ సీడ్‌గా నిలిచారు. బిడబ్లూఎఫ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ డ్రా బుధవారం న్యూఢిల్లీలో జరగనుంది. ఏప్రిల్‌ 28, 2026 ప్రపంచ ర్యాంకింగ్స్‌ ఆధారంగా సీడింగ్‌ను జూలై 28 ర్యాంకింగ్స్‌ ఆధారంగా ఖరారు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్