ప్రజాశక్తి - వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): జాతీయస్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ క్రీడా పోటీలకు వెదురుకుప్పం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని గౌతమి ఎంపికైంది. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివశంకరయ్య శనివారం మీడియాకు వెల్లడించారు. ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు పంజాబ్ రాష్ట్రంలోని భటిండాలో నిర్వహించనున్న జాతీయస్థాయి పోటీల్లో గౌతమి ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా గౌతమికి శిక్షణ అందించిన పీడీ రమేష్‌ను, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన గౌతమిని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు, తల్లిదండ్రులు అభినందించారు.
జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు వెదురుకుప్పం విద్యార్థిని ఎంపిక
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 21, 2026, 01:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)