పారా షాట్‌పుట్‌లో సోనమ్‌కు కూడా..
జావెలిన్ త్రోలో నీరజ్‌కు రజతం
నేటితో ముగియనున్న కామన్వెల్త్ క్రీడలు
కామన్వెల్త్ క్రీడల్లో 10వ రోజు భారత్‌కు స్వర్ణ పతకాల పంట పండింది. మహిళల బాక్సింగ్‌లో ఏకంగా ఐదు స్వర్ణ పతకాలు దక్కాయి. ప్రీతి పవార్(54కిలోలు), జాస్మినే లంబోరియా (57కిలోలు), సాక్షి చౌదరి(51కిలోలు), ప్రియ గంగాస్(60కిలోలు), అరుంధతి చౌదరి స్వర్ణ పతకాలతో మెరిసారు. పారా షాట్‌పుట్ ఎఫ్-57లో సోనమ్ రాణా మరో బంగారు పతకాన్ని అందించాడు. దీంతో 23వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు దక్కిన స్వర్ణాల సంఖ్య 11కు చేరింది. ఇక జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా(రజతం), యశ్వీర్ సింగ్(కాంస్య) పతకంతో మెరవగా.. చివరిరోజు బాక్సింగ్‌లో ఇంకా పతకాలు దక్కనున్నాయి.
గ్లాస్గో: కామన్వెల్త్ క్రీడల్లో మహిళా బాక్సర్లు స్వర్ణ పతకాల పంట పండించారు. శనివారం బాక్సింగ్ విభాగంలోనే భారత్‌కు నాలుగు స్వర్ణ పతకాలు దక్కాయి. పారా షాట్‌పుట్ ఎఫ్-57లో సోనమ్ రాణా మరో బంగారు పతకాన్ని అందించాడు. అలాగే మరో రెండు రజత పతకాలు బాక్సింగ్ విభాగంలో భారత్‌కు దక్కాయి. శనివారం జరిగిన మహిళల 54 కిలోల విభాగంలో ఫైనల్లో ప్రీతి పవార్‌తోపాటు జాస్మినే లంబోయా తొలుత స్వర్ణ పతకాలతో మెరిసారు. ఆ తర్వాత సాక్షి చౌదరీ 51 కేజీల విభాగంలో 5-0తో ఇంగ్లండ్‌కు చెందిన రూబీ వైట్‌ను చిత్తుగా ఓడించింది. మూడు బౌట్లలో ఎదురులేని సాక్షిని జడ్జీలు యునానిమస్ విజేతగా ప్రకటించారు. 60 కేజీల విభాగంలో ప్రియా గంగాస్ కూడా స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. కెనడా బాక్సర్ మారీ అల్ అహ్మదియాను 4-1తో ఓడించింది. దీంతో కామన్‌వెల్త్‌లో భారత్‌కు దక్కిన స్వర్ణ పతకాల సంఖ్య 10కి చేరింది. అంతకుముందు జాస్మినే లంబోరియా మహిళల 57కిలోల విభాగం ఫైనల్లో ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన మిఛెలా వాల్స్ 5-0తో ఓడించిచగా.. ప్రీతి కెనడాకు చెందిన స్కార్లెట్ సవన్నా డెల్గాడోపై 5-0తో విజయం సాధించి స్వర్ణ పతకం ఖాయం చేసింది. ఇక అరుంధతి 70కిలోల విభాగంలో 5-0తో ఇంగ్లండ్ బాక్సర్ ఛంటెల్లే రైడ్‌పై గెలిచింది.
జావెలిన్ త్రోలో నీరజ్‌కు రజతం
జావెలిన్ స్టార్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా వరుసగా రెండోసారి కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ సాధించడంలో విఫలమయ్యాడు. శనివారం జరిగిన ఫైనల్లో నీరజ్ రజత పతకానికే పరిమితమయ్యాడు. ఈ విభాగంలో శ్రీలంకకు చెందిన రమేశ్ స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయాడు. ఇక భారత్‌కే చెందిన యువ అథ్లెట్ యశ్వీర్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. దీంతో పురుషుల జావెలిన్ త్రో విభాగంలో కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఒకేసారి రెండు పతకాలు దక్కడం ఇదే తలొలిసారి. ఫైనల్లో నీరజ్ చోప్రా రెండో ప్రయత్నంలో సీజన్ బెస్ట్ 85.83 మీటర్ల దూరం విసిరాడు. అయితే శ్రీలంక స్టార్ రమేశ్ పతిరగె 89.75 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తొలిసారి ఈ క్రీడల బరిలోకి దిగిన 24 ఏళ్ల యశ్వీర్ సింగ్ చివరి ప్రయత్నంలో 85.41 మీటర్లు విసిరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇదే అతడి వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన. చివరి రౌండ్‌కు ముందు ఏడో స్థానంలో ఉన్న యశ్వీర్ ఒక్క త్రోతో మూడో స్థానానికి ఎగబాకి కాంస్యాన్ని ఖాయం చేసు కున్నాడు. మరో భారత అథ్లెట్ రోహిత్ 81.56మీ.తో ఏడో స్థానంలో నిలిచాడు.
పారా షాట్‌పుట్‌లో భారత్‌కు స్వర్ణ, రజత పతకాలు దక్కాయి. శనివారం జరిగిన పురుషుల పారా షాట్‌పుట్ ఎఫ్-57 ఫైనల్లో సోనమ్ రాణా స్వర్ణ పతకం చేజిక్కించుకోగా.. శుభమ్ జుయాల్ రజత పతకం సాధించాడు. రాణా గుండును తొలి ప్రయత్నంలో 13.38విసరగా.. రెండోరౌండ్‌లో 13.40మీ. అత్యుత్తమ త్రో తో రాణించి బంగారు పతకాన్ని సాధించాడు. మూడో ప్రయత్నం ఫౌల్ కాగా.. మిగిలిన రౌండ్‌లలో 13.14మీ, 13.17మీ. 13.11మీ. విసిరాడు. ఈ సీజన్‌లోనే రాణా అత్యుత్తమ ప్రదర్శనతో రాణించాడు. ఇక రజత పతకం సాధించిన జుయల్ 13.08మీ. ప్రారంభించి 12.42మీ. మూడో ప్రయత్నంలో 13.27మీ. విసిరాడు. ఐదో, చివరి ప్రయత్నంలో ఏకంగా 13.38మీ. విసిరిన రజత పతకం సాధించాడు.. కేమరూన్‌కు చెందిన సెడ్రిక్ ఇడ్రిస్ 12.57మీ. కాంస్య పతకం చేజిక్కించుకున్నాడు.








కామెంట్‌లు (0)