న్యూయార్క్: యుఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లోకి టాప్‌సీడ్, బెలారస్‌కు చెందిన అర్యానా సబలెంక ప్రవేశించింది. మంగళవారం జరిగిన తొలి క్వార్టర్ ఫైనల్లో సబ లెంక మూడుసెట్ల హోరాహోరీ పోరులో 6వ ర్యాంకర్, చెక్ రిపబ్లిక్‌కు చెందిన నోస్కోవాను చిత్తుచేసింది. తొలి సెట్‌ను 7-6(7-1)తో టై బ్రేకర్‌లో గెలిచిన సబలెంక రెండో సెట్‌ను 3-6తో కోల్పోయింది.
క్వార్టర్స్‌కు రైబకినా, గాఫ్..
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లోకి 4వ సీడ్, అమెరికాకు చెందిన కోకో గాఫ్, 2వ సీడ్, కజకిస్తాన్‌కు చెందిన ఎలైనా రైబకినా ప్రవేశించారు. మంగళవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో రైబకినా 6-1, 6-4తో జపాన్ సంచలనం, 13వ సీడ్ నవోమీ ఒసాకాను చిత్తుచేయగా.. కోకో గాఫ్ 6-1, 6-4తో 14వ సీడ్, సహచర క్రీడాకారిణి జోవిక్‌పై విజయం సాధించింది. ప్రీ క్వార్టర్‌ఫైనల్లో ఓడిన నవోమి ఓసాకా.. ఫ్యాషన్ పరంగా అభిమానుల మనసు గెలిచింది. మ్యాచ్ సందర్భంగా ఆమె ధరించిన కోట్ అందరిని ఆకర్షించింది. నాలుగుసార్లు గ్రాండ్‌స్లామ్ ఛాంపియన్ నవోమి ఒసాకా.. తాను ఆడే ప్రతి మ్యాచ్ ప్రత్యేకంగా ఉండేలా ఈసారి యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆడింది. రైబాకినాతో జరిగిన మ్యాచ్ కోసం ఒసాకా వివిధ రకాల డిజైన్లను ఒకచోట చేర్చినట్లు ఉన్న ఒక కోట్‌ను ధరించింది. దీనిని బ్రూక్లిన్‌కు చెందిన స్ట్రీట్‌వేర్ లేబుల్ కిడ్‌సూపర్ రూపొందించింది. లా రోచ్ అనే ఫ్యాషన్ డిజైనర్ దీనికి మరింత మెరుగులు దిద్దారు. మొత్తంగా నవోమి ఓసాకా ధరించిన ఈ కోట్ అందరిని ఆకట్టుంది.
టాప్‌సీడ్ జ్వెరేవ్, ఖచనోవ్ కూడా..
పురుషుల సింగిల్స్‌లో టాప్‌సీడ్, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్ క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన ప్రీ క్వార్టర్ ఫైనల్లో జ్వెరేవ్ 6-2, 6-2, 7-6(7-3)తో 21వ సీడ్, ఇటలీకి చెందిన దగ్దేరిని చిత్తుచేశాడు. మరో పోటీలో అన్‌సీడెడ్, రష్యాకు చెందిన ఖచనోవ్ 7-5, 4-6, 6-7(6-8), 6-1, 6-4తో 14వ సీడ్, అమెరికాకు చెందిన టియన్‌ను చిత్తుచేశాడు. ఇద్దరు అన్‌సీడెడ్ క్రీడాకారుల మధ్య జరిగిన మరో ఐదుసెట్ల ప్రీ క్వార్టర్ ఫైనల్ సంగ్రామంలో నెదర్లాండ్స్‌కు చెందిన వాన్-డి-బౌండ్‌స్చుల్స్ విజయం సాధించాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బౌండ్‌స్చుల్స్ 3-6, 6-7(0-7)తో తొలి రెండు సెట్లు చేజార్చుకున్నా.. ఆ తర్వాత మూడు సెట్లను 7-6(9-7), 7-6(7-3), 6-4తో గెలిచి ఆర్ధర్ జియా(ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.








కామెంట్‌లు (0)