బుధవారం, 02 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionUS Open:టాప్‌‌సీడ్‌ ‌జ్వెరేవ్‌ ‌చెమటోడ్చి...

1 గంట క్రితం

jverevtennis-1788363707129-3734.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 02, 2026, 09:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ

న్యూయార్క్‌: యుఎస్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీలో టాప్‌‌సీడ్‌, జర్మనీకి చెందిన అలెగ్జాండర్‌ ‌జ్వెరేవ్‌ ‌తొలిరౌండ్‌‌లో చెమటోడ్చి విజయం సాధించాడు. బుధవారం జరిగిన తొలిరౌండ్‌ ‌పోటీలో జ్వెరేవ్‌ 6-4, 3-6, 6-7(7-9), 7-5, 6-4తో ఇటలీకి చెందిన సోనెగోను ఓడించాడు. తొలి సెట్‌‌ను గెలిచిన జ్వెరేవ్‌.. రెండో సెట్‌‌ను ప్రత్యర్ధికి చేజార్చుకున్నాడు. ఇక మూడో సెట్‌‌లోనూ టై బ్రేకర్‌‌లో సోనెగోకు సమర్పించుకోవడంతో మూడుసెట్లు ముగిసేసరికి 2-1తో వెనుకబడ్డాడు. ఈ క్రమంలో అద్భుతంగా పుంజుకున్న జ్వెరేవ్‌ ‌మిగిలిన రెండు సెట్లను చేజిక్కించుకొని రెండోరౌండ్‌‌కు చేరాడు. మరో పోటీలో ఇటలీకి చెందిన 13వ సీడ్‌ ‌మసెట్టి వరుససెట్లలో బ్రిటన్‌‌కు చెందిన అర్దర్‌ ‌ఫెర్రీని చిత్తు చేశాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌‌లో మసెట్టి 6-3, 6-3, 7-5తో ఫెర్రీని ఓడించాడు.
ఇక మహిళల సింగిల్స్‌‌లో 4వ సీడ్‌, అమెరికా సంచలనం కోకో గాఫ్‌ ‌వరుససెట్లలో టర్కీకి చెందిన సాన్మెజ్‌‌ను ఓడించింది. ఏకపక్షంగా సాగిన తొలిరౌండ్‌ ‌గేమ్‌‌లో కోకో గాఫ్‌ 6-3, 6-4తో సాన్మెజ్‌‌ను చిత్తుచేసింది. ఇతర పోటీల్లో 24వ సీడ్‌ ‌పోలండ్‌‌కు చెందిన పొటపోవా 6-2-,6-2తో డార్ల సెనెనిస్టాజను, 23వ సీడ్‌, జర్మనీకి చెందిన మెర్టెన్స్‌ 6-4, 6-4తో క్యాట్లిన్‌‌ను ఓడించారు. ఇక 5వ సీడ్‌, రష్యాకు చెందిన ఆండ్రీవా 6-2, 6-2తో జానిస్‌ ‌టెన్‌‌ను ఓడించి రెండోరౌండ్‌‌కు చేరారు. ఇక 32వ సీడ్‌, గ్రీక్‌‌కు చెందిన సక్కారి 2-6, 7-5, 6-2తో మాంటోగోమరీ(అమెరికా)ను చిత్తుచేయగా.. 12వ సీడ్‌ ‌బెన్సిక్‌(‌డెన్మార్క్‌) 6-4, 5-7, 3-6తో కజకిస్తాన్‌‌కు చెందిన అన్‌‌సీడెడ్‌ ‌పుటెంట్సెవా చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్