శుక్రవారం, 13 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సెమీస్‌కు చేరాలంటే గెలవాల్సిందే

3 రోజుల క్రితం

india
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 09, 2026, 09:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- నేడు యుఎఇతో యువ భారత్‌ ఢీ

- అండర్‌-19 ఆసియాకప్‌

మస్కట్‌(ఒమన్‌): అండర్‌-19 ఆసియాకప్‌లో భారత యువ క్రికెటర్లు కఠిన పరీక్ష‍ను ఎదుర్కోనున్నారు. ఆదివారం జరిగిన కీలక పోరులో పాకిస్తాన్‌ చేతిలో అనూహ్య ఓటమిపాలై మంగళవారం జరిగే గ్రూప్‌ లీగ్‌ చివరి మ్యాచ్‌లో యుఎఇతో అమీ తుమీకి సిద్ధమయ్యారు. నాలుగు జట్లున్న ప్రతి గ్రూప్‌లో కేవలం రెండు జట్లు మాత్రమే సెమీస్‌కు చేరనున్న క్రమంలో టీమిండియాకు ఈ విజయం తప్పనిసరి. ఇదే గ్రూప్‌లో ఉన్న పాకిస్తాన్‌ ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లతో ఇప్పటికే సెమీస్‌ బెర్త్‌ ఖాయం చేసుకోగా.. భారత్‌, యుఎఇ జట్లు 2 పాయింట్లతో ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. నేడు పాకిస్తాన్‌ యువ జట్టు తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడనుంది.

నాకౌట్‌కు ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌

గ్రూప్‌-బినుంచి సెమీస్‌కు ఆఫ్ఘనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ జట్లు ప్రవేశించాయి. సోమవారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 106 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుచేయగా.. బంగ్లాదేశ్‌ జట్టు 205 పరుగుల తేడాతో మలేషియాను ఓడించింది. ఆఫ్ఘన్‌ జట్టు 49.5ఓవర్లలో 275పరుగులకు ఆలౌట్‌ కాగా.. శ్రీలంక జట్టు 34.1ఓవర్లలో 169 పరుగులకే కుప్పకూలింది. ఇక బంగ్లాదేశ్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 303 పరుగుల భారీస్కోర్‌ చేయగా.. మలేషియా జట్టు 30.5ఓవర్లలో 98 పరుగులకే ఆలౌటైంది. గ్రూప్‌-ఎలో టాప్‌లో నిలిచిన గ్రూప్‌-బిలో 2వ స్థానంలో బంగ్లాదేశ్‌తో తలపడనుండగా.. గ్రూప్‌-బిలో టాప్‌లో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు గ్రూప్‌-ఎలో 2వ స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్‌లో తలపడనున్నాయి. సెమీస్‌ 12న, ఫైనల్‌ 14న జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్