బుధవారం, 18 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ధోని కొత్త ప్రయాణానికి స్వాగతం : సాక్షి పోస్ట్

12 గంటల క్రితం

Welcome to Dhonis new journey Sakshi post
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 18, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

క్రీడలు : ఐపిఎల్‌ లో 19 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో కెప్టెన్‌ గా, బ్యాటర్‌ గా, వికెట్‌ కీపర్‌ గా తనదైన ముద్ర వేసిన మహేంద్ర సింగ్‌ ధోని ఆటగాడిగా తన ఇన్నింగ్స్‌కు ముగింపు పలకడం అభిమానులను నిరాశకు గురిచేసింది. అయితే చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సిఎస్కె) జట్టుకు ధోని మెంటార్‌గా కొనసాగుతూ అభిమానులకు అందుబాటులో ఉండనున్నారు. ఈ నేపథ్యంలో ధోని భార్య సాక్షి సోషల్‌ మీడియాలో భావోద్వేగభరితమైన పోస్టు చేశారు.


జీవితంలో అందమైన కొత్త ప్రయాణం ప్రారంభం కావాలంటే కొన్ని అధ్యాయాలకు ముగింపు పలకాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు. ఇన్నేళ్లుగా మహీని ప్రేమిస్తూ, నమ్మకంగా వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అభిమానులు చూపిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొంటూ, కొత్త ఆరంభాలు, సరికొత్త సాహసాలు, మరెన్నో మధుర జ్ఞాపకాలకు స్వాగతం పలికారు. ధోనిని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని సాక్షి తన పోస్టులో వెల్లడించారు. పర్వతాల వైపు చూస్తున్న ధోని ఫొటోను కూడా ఆమె పంచుకున్నారు. ఈ పోస్టు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.


కాగా, కోల్‌కతాలోని తాజ్‌ హోటల్‌ వద్ద ప్రారంభమైన ధోని, సాక్షిల పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. అనంతరం 2010లో ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి ప్రేమకథ ఆధారంగా తెరకెక్కిన 'ఎం.ఎస్‌. ధోని: ది అన్‌టోల్డ్‌ స్టోరీ' చిత్రం కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్