గురువారం, 06 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Print EditionWomen S U18 Asia Cup: షిలీమా చానుకు పగ్గాలు

5 గంటల క్రితం

womenshokey2
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 06, 2026, 09:21 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • మహిళల జూనియర్‌ ‌హాకీ ఆసియాకప్‌‌కు జట్టు ఇదే

భువనేశ్వర్‌: చైనా వేదికగా జరిగే మహిళల జూనియర్‌ ‌హాకీ ఆసియాకప్‌‌కు జట్టును హాకీ ఇండియా(హెచ్‌ఐ) ప్రకటించింది. మిడ్‌‌ఫీల్డర్‌ ‌ఖైడెమ్‌ ‌షిలీమా చానుకు సారథ్యంలోని 18మందితో ఆటగాళ్లతో కూడిన భారత మహిళల జట్టు దుర్భేధ్యంగా ఉంది. నూతన కోచ్‌ ‌టీమ్‌ ‌వైట్‌ ‌తొలి మెగా టోర్నమెంట్‌ ఇదే. స్కాట్లాండ్‌, బెల్జియం, అమెరికాలతో ఏడు మ్యాచ్‌‌లు, ఇంగ్లాండ్‌ పర్యటనను దిగ్విజయంగా ముగించిన జూనియర్‌ ‌జట్టు ఆసియాకప్‌‌లో ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్‌ 13‌వరకు చైనాలోని మాఖీలో ఈ టోర్నమెంట్‌ ‌జరగనుంది.
జట్టు...
గోల్‌‌కీపర్లు: నిధి, ఇంగిల్‌ హర్ష్‌ ‌రాణి
డిఫెండర్లు: పూజా సాహో, సుప్రియ, పూజ మాలిక్‌, పార్వతి టొప్నో, మధు
మిడ్‌‌ఫీల్డర్లు: షిలెమా ఛాను(కెప్టెన్‌), తనూజ టొప్పో, బినిమా ధాన్‌, రోష్నీ, గీత యాదవ్‌
ఫార్వర్డ్స్‌: లాల్‌‌రిన్‌‌పుయ్‌, పూర్ణిమా యాదవ్‌, సుఖ్వీర్‌ ‌కౌర్‌, కృష్ణా శర్మ, సనిక చంద్రకాంత, మధు సిదార్‌.
స్టాండ్‌‌బై: లాల్‌‌బిక్సిమా, తనుశ్రీ.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్