బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్
న్యూఢిల్లీ: బిడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో భారత షట్లర్లు శుభారంభం చేశారు. సోమవారం జరిగిన రౌండ్-64 మహిళల సింగిల్స్‌లో పివి సింధు, పివి సింధు, డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్-త్రీసా జోలీ జంటతోపాటు పురుషుల డబుల్స్‌లో హంసకరణ్-ఎంఆర్ అర్జున్ జోడీలు శుభారంభం చేశాయి. తొలిరౌండ్‌లో సింధు 21-7, 21-11తో ఐర్లాండ్‌కు చెందిన సోఫియా నోపెల్‌ను వరుససెట్లలో చిత్తుచేసింది. తొమ్మిదో సీడ్ సింధు.. తొలి గేమ్‌ను సునాయాసంగా సొంతం చేసుకుంది. ప్రపంచ 141వ ర్యాంకు ప్లేయర్ అయిన సోఫియా రెండో గేమ్‌లో పోరాడింది. ఒక దశలో 10-8 నిలిచి ఆధిక్యంలోకి నిలిచినా.. ఆ తర్వాత సింధు పుంజుకుని వరుసగా పాయింట్లు సాధించి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అంతకుముందు మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రీసా జోలీ జంట తొలి రౌండ్‌లో విజయం సాధించి రౌండ్ 32కు దూసుకెళ్లింది. ఈ జోడీ వరుస గేమ్‌ల్లో 21-9, 21-13 తేడాతో పౌలా-లూసియా (స్పెయిన్)ని చిత్తు చేసింది. పురుషుల డబుల్స్‌లో ఎంఆర్ అర్జున్-హరిహరన్ జంట కూడా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. స్కాట్-రేమాండ్స్ (ఐర్లాండ్) జంటతో జరిగిన తొలి రౌండ్‌లో అర్జున్ ద్వయం తొలి గేమ్‌ను 21-16తో సొంతం చేసుకుంది. రెండో గేమ్‌లో భారత జోడీ 1-0 ఆధిక్యంలో ఉండగా ఐరిష్ ద్వయం రిటైర్డ్ హర్ట్‌గా వైదొలిగింది.








కామెంట్‌లు (0)