మంగళవారం, 21 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ఫైనల్‌‌కు జ్వెరేవ్‌

10 జులై, 2026

wimboldon
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 11, 2026, 12:29 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- వింబుల్డన్‌ ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీ

లండన్‌: వింబుల్డన్‌ ‌గ్రాండ్‌ ‌స్లామ్‌ ‌టోర్నీ పురుషుల సింగిల్స్‌ ‌ఫైనల్లోకి 2వ ర్యాంకర్‌, జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరేవ్‌ ‌దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన తొలి సెమీఫైనల్లో జ్వెరేవ్‌ వరుససెట్లలో స్థానిక సంచలనం, బ్రిటన్‌‌కు చెందిన అన్‌‌సీడెడ్‌ ఆర్దర్‌ ‌ఫెరీని చిత్తుచేశాడు. తొలి సెట్‌‌ను చేజిక్కించుకొనేందుకు చెమటోడ్చిన జ్వెరేవ్‌.. రెండు, మూడు సెట్లను సునాయాసంగా చేజిక్కించుకొన్నాడు. సెంటర్‌ ‌కోర్టులో జరిగిన ఈ పోటీలు జ్వెరేవ్‌ 7-6(7-0), 6-2, 6-4తో పెర్రీని ఓడించాడు. దీంతో సంచలన విజయాలతో సెమీస్‌‌కు చేరిన వైల్డ్‌‌కార్డ్‌ ఆటగాడిని పోరు ముగిసింది. మరోవైపు ఈ ఏడాది అద్భుత ఫామ్‌‌లో ఉన్న జ్వెరేవ్‌ ఇటీవల ముగిసిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ‌గ్రాండ్‌ ‌స్లామ్‌ ‌టైటిల్‌‌ను చేజిక్కించుకున్న ఉత్సాహంతో కెరీర్‌‌లో రెండో గ్రాండ్‌‌స్లామ్‌‌పై కన్నేశాడు. అలాగే వింబుల్డన్‌ ‌గ్రాండ్‌ ‌స్లామ్‌ ‌టోర్నీ ఫైనల్‌‌కు చేరడం జ్వెరేవ్‌‌కు ఇదే తొలిసారి.

నేడు మహిళల సింగిల్స్‌ ‌ఫైనల్‌...

మహిళల సింగిల్స్‌ ‌టైటిల్‌ ‌పోరు ఇద్దరు చెక్‌ ‌క్రీడాకారిణుల మధ్య శనివారం జరగనుంది. ‌గ్రాండ్‌‌స్లామ్‌ ‌టోర్నీల చరిత్రలో ఫైనల్లో ఇద్దరూ చెకియా ప్లేయర్చేరారు డడం ఇదే తొలిసారి. సెమీస్‌‌లో 9వ సీడ్‌ నోస్కోవా 12వ సీడ్‌, ఉక్రెయిన్‌‌కు చెందిన కోస్ట్యూక్‌‌ను, 10వ సీడ్‌ ‌ముఛోవా 7వ సీడ్‌, కోకో గాఫ్‌‌(అమెరికా)ను ఓడించి తుదిపోరుకు చేరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్