దీపావళి అంటే దీపాల వెలుగులు.. కుటుంబ సభ్యుల సందడి.. మిఠాయిల మధురిమలు. అయితే బాణసంచా కాల్చడం వల్ల పెరిగే వాయు, ధ్వని కాలుష్యం పర్యావరణానికే కాదు.. మనుషులకు, మూగజీవాలకూ ఇబ్బందులు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో పర్యావరణాన్ని కాపాడుతూ దీపావళి జరుపుకోవాలని పలువురు సినీ ప్రముఖులు తమ సోషల్ మీడియా సందేశాల ద్వారా పిలుపునిచ్చారు. ఆ సందేశాల్లోని కొన్ని మాటలు..
చిరంజీవి : అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి మన జీవితాల్లో ప్రేమ, ఆనందం, ప్రశాంతతను నింపాలని కోరుకుంటున్నాను. పండుగను సరదాగా జరుపుకుందాం. పర్యావరణాన్ని కాపాడుకుందాం.
బాలకృష్ణ : తెలుగు వారందరికీ శుభాకాంక్షలు. ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుందాం. పండుగ వెలుగులు ప్రతి ఒక్కరి జీవితాల్లో విజయాన్ని, సంతోషాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 
నాగార్జున : అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ వెలుగులు మన జీవితాల్లోని చీకట్లను తొలగించాలని కోరుకుంటున్నాను.
జూనియర్ ఎన్టీఆర్ : మన సంస్కృతికి ప్రతిబింబాలు పండుగలు. ఇలాంటి పండుగల్లోనే మనలో ఐక్యత పెంపొందుతుంది. సామరస్యం చోటుచేసుకుంటుంది. ప్రతి ఒక్కరికీ పేరు పేరున శుభాకాంక్షలు.

రామ్‌చరణ్ : పండుగల వైభవాన్ని భావితరాలకు తెలియజేద్దాం. కాలుష్య రహిత సమాజం కోసం పాటుపడదాం. జీవ జగత్తును కాపాడుకుందాం. అందరికీ సంతోషకరమైన, సిరిసంపదలతో కూడిన వైభవం కావాలి. 
మహేశ్‌బాబు : పండుగ వెలుగుల్లో ప్రేమ, ఆశ, ఆనందాలను పంచుకునే సందర్భంగా మనం పర్యావరణాన్ని కాలుష్యం నుంచి కాపాడుకోవాలని గుర్తుంచుకుందాం. ఈ పండుగలో ప్రేమ, శాంతి సందేశాన్ని వ్యాపింపజేసేందుకు దీపం వెలిగిద్దాం.

నమ్రతా శిరోద్కర్: పండుగ ఆనందం బాణసంచా శబ్దాల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. మట్టి దీపాలు వెలిగించడం, కుటుంబంతో సమయం గడపడం, అవసరమైన వారికి సాయం చేయడం ద్వారా కూడా ఆనందంగా జరుపుకోవచ్చు.

రష్మిక మందన్న: పండుగలు అందించేది మానవత్వం.సంతోషమే. దానిని శుభాకాంక్షలు చెప్పటం ద్వారా కూడా చెప్పొచ్చు. టపాసులు కాల్చొద్దు. స్వీట్లు వంటివి ఇచ్చి పుచ్చుకోవటం ద్వారా కూడా చేయొచ్చు. కుటుంబంతో కలిసి పండుగను ఆస్వాదించండి. సురక్షితంగా ఉండండి.. సంతోషంగా ఉండండి. మనందరికీ మెరుగైన భవిష్యత్తు కలగాలి.
విజయ్ దేవరకొండ: మీరంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పర్యావరణహిత దీపావళిగా పాటించాలి. ప్రజలంతా తమ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలి.
అల్లు అర్జున్: మన భూమిని మరింత అందమైన ప్రదేశంగా మార్చుకుందాం. ప్రకృతి అందాలను కాపాడుతూ, వనరులను పరిరక్షిస్తూ, సుస్థిర భవిష్యత్తు కోసం మనమంతా కృషి చేద్దాం.
సమంత : పండుగలను సంతోషంగా జరుపుకోవాలి. ఇతరులకు ఇబ్బంది కల్గించకుండా చూసుకోవాలి. పర్యావరణానికి హాని చేయకుండా అందరం సంతోషంగా జరుపుకునేదే పండుగ. సంతోషం పేరుతో అతిచేస్తే విషాధానికి గురవుతారు.








కామెంట్‌లు (0)