హాయ్ ఫ్రెండ్స్,
నేను మూడో తరగతిలో ఉన్నప్పుడు మా తెలుగు టీచరు గారు అమ్మ గురించి నాలుగు వాక్యాలు రాయండి అని చెప్పారు. ఇంతకు ముందెప్పుడూ అమ్మ గురించి నేను ఏమీ రాయలేదు. కానీ హోంవర్కు కదా! కచ్చితంగా రాయాలి. అప్పుడేమో అమ్మ దగ్గరకు వెళ్లి నువ్వు, ఏమి చేస్తావో చెప్పు రాస్తాను’ అన్నాను. అమ్మ ఏమో ‘నేను ఏం చేస్తానో నువ్వు రోజూ చూస్తావుగా అవే రాయి’ అన్నది. అప్పుడు ఇలా రాశాను ఫ్రెండ్స్.
‘అమ్మ నాకు వంట చేసింది. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. అమ్మ నాకు టిఫిన్ పెట్టింది. అమ్మ నాకు బట్టలు వేసింది’ అని నాలుగు వ్యాక్యాలు రాశాను ఫ్రెండ్స్. అయినా ఇంకా అమ్మ గురించి ఏదో రాయాలనిపించి పేపరు, పెన్సిలు అలాగే పట్టుకుని ఉన్నాను. అప్పుడు అమ్మ నాకు అన్నం తినిపిస్తోంది. చివర్లో ఇదిగో ‘ఈ గోరు ముద్ద తిను చాలా రుచిగా ఉంటుంది’ అంది. అంతే నాకు ఐదో వాక్యం వచ్చేసింది. ‘అమ్మ నాకు గోరుముద్దలు పెట్టింది’ అని రాసి హోంవర్కు పూర్తి చేసేశాను.


ఎం. అభినవ్, 4వ తరగతి,
అరవింద హైస్కూలు,
కుంచనపల్లి, గుంటూరు జిల్లా.









కామెంట్‌లు (0)