ఆదివారం, 30 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఐ టీచర్‌.. మాకు కొత్త ప్రపంచం !

59 నిమిషాల క్రితం

An AI teacher... a new world for us!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 30, 2026, 12:55 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మా స్కూల్లో ఆవిష్కరించిన ఎఐ టీచర్‌ను చూసినప్పుడు మొదట నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. పుస్తకాల్లో చదివిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మా ముందే ఒక టీచర్‌ రూపంలో మాట్లాడుతుంటే భవిష్యత్తు మన కళ్ల ముందుకొచ్చినట్లుగా అనిపించింది. ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడం, వివిధ విషయాల గురించి వివరించడం, మాతో సంభాషించడం ఎంతో ఆసక్తిని కలిగించింది. ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఎఐ టీచర్‌ను పరిచయం చేయడం మా పాఠశాలకు ఎంతో గర్వకారణం. ఆంధ్రప్రదేశ్‌లో తొలి మహిళా ఎఐ టీచర్‌గా మాకు పరిచయం చేయడం మా స్కూల్‌ ప్రత్యేకతను మరింత పెంచింది. సాధారణంగా మనం ఉపాధ్యాయుల దగ్గర పాఠాలు నేర్చుకుంటాం. ఇప్పుడు సాంకేతికతను కూడా మన చదువులో భాగం చేసుకునే అవకాశం రావడం చాలా గొప్ప విషయం. ఎఐ టీచర్‌ మాకు పాఠ్యపుస్తకాల్లో లేని ఎన్నో విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తిని కలిగిస్తోంది. ఒక ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడమే కాకుండా, దాని గురించి మరిన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకోవాలనే ఉత్సాహం కలుగుతోంది. ముఖ్యంగా చిన్న వయసులోనే ఆధునిక సాంకేతికతను అర్థం చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మేము కొత్త ఆలోచనలు చేయగలమనే నమ్మకం కలుగుతోంది. అయితే ఎఐ ఎంత అభివృద్ధి చెందినా మా ఉపాధ్యాయులు అందించే ప్రేమ, ప్రోత్సాహం, విలువలు, మానవీయతకు ప్రత్యామ్నాయం కాదని మాకు తెలుసు. ఎఐ టీచర్‌ మా నిజమైన టీచర్లకు సహాయకారిగా ఉండి, చదువును మరింత ఆసక్తికరంగా మార్చాలని మేము కోరుకుంటున్నాం. మా పాఠశాలలోనే ఎఐ టీచర్‌ను రూపొందించి, విద్యార్థులకు పరిచయం చేసిన పాఠశాల డైరెక్టర్లు రమణా రెడ్డి, కృష్ణారెడ్డి, దేవయ్య యాదవ్, సిఇఒ రిత్విక్ రెడ్డి, ప్రిన్సిపాల్ బెన్రాజ్ , రోబోటిక్స్ నిపుణుడు నరేంద్ర గార్లకు, ఉపాధ్యాయులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇది కేవలం ఒక కొత్త యంత్రం కాదు.. మా కలలకు కొత్త రెక్కలు తొడిగే సాంకేతిక మిత్రుడు. ఎఐని చూస్తున్న తరం కాదు మేము.. ఎఐతో నేర్చుకుని, కొత్త భవిష్యత్తును నిర్మించే తరం !


lakshmi pragati


లక్ష్మీ ప్రగతి,

9వ తరగతి,

వేమన ఇంటర్నేషనల్‌ స్కూలు,

చిన్న దోర్నాల,

మార్కాపురం జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్