హాయ్ ఫ్రెండ్స్!
మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. ఎన్నో భాషలు, యాసలు, కులాలు, మతాలు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ మనమంతా భారతీయులమనే భావనతో కలిసి జీవిస్తున్నాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మన ఆహారపు అలవాట్లు, వస్త్రధారణలు, పండుగలు వేరైనా మన దేశం ఒక్కటే. ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకోవడం, కష్టసుఖాల్లో తోడుగా ఉండటం మన ఐక్యతకు నిదర్శనం.
మన పాఠశాలలో కూడా ఇలాంటి మంచి భావాలను అలవర్చుకోవాలని ఆంగ్లభాషా ఉపాధ్యాయులు గుడిపూడి సత్యనారాయణ, ప్రధానోపాధ్యాయులు తుర్లపాటి నగేష్ మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు. భిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాల గురించి తెలుసుకోవాలని, ప్రతి ఒక్కరినీ సమానంగా గౌరవించాలని సూచిస్తున్నారు. కులమతాలకు అతీతంగా స్నేహభావంతో మెలగడం, దేశ ఐక్యతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని వివరిస్తున్నారు. వారి ప్రోత్సాహంతో భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకుంటూ, మంచి పౌరులుగా ఎదగాలనే స్ఫూర్తి మాలో కలుగుతోంది. మనలో ఎన్నో భిన్నత్వాలు ఉన్నా మనమంతా ఒక్కటే. ఇతరుల సంస్కృతులను గౌరవిస్తూ, ప్రేమాభిమానాలతో కలిసి జీవిద్దాం. మన దేశ ఐక్యతను కాపాడుకుందాం.
వైవిధ్యమే మన బలం.. ఐక్యతే మన గర్వం!








కామెంట్లు (0)