అల్లరి చేశాను చిన్నప్పుడు
హఠమూ చేశాను ఎల్లప్పుడు!!
అమ్మ చంకన నేనుండాలని
అన్న మాతొ నడుస్తుండాలని!!
లక్కపిడత ఎప్పటికి నాదని
అక్క దాన్ని ముట్టుకోరాదని!!
పంచదార చిలక కావాలని
పంజరంలొ పెట్టుకోవాలని!!
పాత లంగా ఇక నా కొద్దని
పట్టు లంగాయే కడు ముద్దని!!
చందమామా దిగి రావాలని
అందరితో ఆడుకోవాలని!!
అమ్మమ్మ వద్దకు పోవాలని
ఆమె ఒళ్ళో పడుకోవాలని!!
తాత బొజ్జపైన ఎక్కాలని
చేతుల్తొ బుగ్గలు నొక్కాలని!!
‘బాలబంధు` అలపర్తి వెంకటసుబ్బారావు.
(కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత)
9440805001.







కామెంట్‌లు (0)