శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపరిశుభ్రతే ఆరోగ్యానికి తొలి మెట్టు!

15 నవంబర్, 2026

WhatsApp Image 2026-11-07 at 4.12.28 PM(1).jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 02:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

హాయ్ ఫ్రెండ్స్‌!

మీరంతా బాగున్నారా? నాకు మా స్కూలంటే చాలా ఇష్టం. మా స్కూల్లో చదువుతో పాటు ఎన్నో మంచి అలవాట్లు కూడా నేర్పిస్తున్నారు. వాటిలో నాకు బాగా నచ్చిన విషయం పరిశుభ్రత. మనం ఉండే ఇల్లు, చదువుకునే స్కూలు, మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని మా టీచర్లు చెబుతుంటారు. మా స్కూల్లో ప్రతిరోజూ శుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదని, చెత్తబుట్టలోనే వేయాలని నేర్పిస్తున్నారు. భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని, తిన్న తర్వాత నోరు కడుక్కోవాలని చెబుతుంటారు. గోళ్లు పెంచుకోకూడదని, రోజూ స్నానం చేసి, శుభ్రమైన దుస్తులు వేసుకోవాలని కూడా నేర్పిస్తున్నారు. మేమంతా ఈ మంచి అలవాట్లను పాటించడానికి ప్రయత్నిస్తున్నాం. మా స్కూల్లో పండుగలు, జాతీయ పండుగలు, జాతీయ నాయకుల జయంతులు, వర్థంతులు, ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తుంటారు. అలాంటి సందర్భాల్లో స్కూలును అందంగా అలంకరించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూస్తారు. కార్యక్రమాలు పూర్తయిన తర్వాత చెత్తను అక్కడక్కడా వేయకుండా శుభ్రం చేయాలని మా టీచర్లు సూచిస్తుంటారు. మనం ఎక్కడికి వెళ్లినా పరిశుభ్రత పాటించాలని చెబుతారు. మా టీచర్లు పరిశుభ్రత ఎందుకు అవసరమో కూడా మాకు చక్కగా వివరిస్తుంటారు. మన పరిసరాలు శుభ్రంగా లేకపోతే దోమలు, ఈగలు పెరిగి జబ్బులు వస్తాయని చెబుతారు. అందుకే మన ఇంటిని, స్కూలును, వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని తెలుసుకున్నాను. నీటిని వృథా చేయకూడదని, చెట్లను పెంచాలని, పరిసరాల్లో చెత్త పేరుకుపోకుండా చూడాలని కూడా నేర్చుకున్నాను. మా స్కూల్లో మేము పాటించే మంచి అలవాట్లను చూసి కరస్పాండెంట్‌, ప్రిన్సిపాల్‌ ఎంతో సంతోషిస్తారు. మమ్మల్ని అభినందిస్తూ ఇంకా మంచి అలవాట్లు అలవర్చుకోవాలని ప్రోత్సహిస్తుంటారు. వారు చెప్పే మాటలు నాకు చాలా నచ్చుతాయి. నేను కూడా మా ఇంటిని, స్కూలును, పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను. నా స్నేహితులకు కూడా పరిశుభ్రత గురించి చెబుతాను.

శుభ్రతను మన అలవాటుగా మార్చుకుందాం.. ఆరోగ్యంగా, ఆనందంగా జీవిద్దాం!


జి. జీవన

2వ తరగతి, బచపన్‌ ప్లే స్కూలు,

తాడేపల్లి, గుంటూరు జిల్లా.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్