హాయ్ ఫ్రెండ్స్!
మన భారతదేశం అనేక పండుగలకు నిలయం. సంక్రాంతి, ఉగాది, దీపావళి, దసరా, వినాయక చవితి, క్రిస్మస్, రంజాన్ వంటి పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి పండుగ వెనుక ఒక ప్రత్యేకమైన సందేశం ఉంటుంది. సంక్రాంతి రైతుల కష్టానికి ప్రతిఫలంగా పంటలు ఇంటికి చేరే ఆనందాన్ని తెలియజేస్తుంది. ఉగాది కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. దీపావళి చీకటిపై వెలుగు విజయానికి ప్రతీక. పండుగల సమయంలో కుటుంబ సభ్యులందరూ కలుసుకుంటారు. ఇళ్లను శుభ్రం చేసుకుని అందంగా అలంకరిస్తారు. కొత్త దుస్తులు ధరించి, పిండి వంటలు చేసుకుంటారు. అయితే పండుగలను పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవాలి. ఆడంబరాలకు, అనవసర ఖర్చులకు దూరంగా ఉండాలి. పేదవారితో కూడా పండుగ సంతోషాన్ని పంచుకోవాలి. పండుగలు మనలో ఐక్యత, ప్రేమ, సోదరభావాన్ని పెంపొందిస్తాయి.
యడవల్లి మోక్షశ్రీ
9వ తరగతి, శ్రీ చైతన్య హైస్కూలు,
పటమటలంక, విజయవాడ.








కామెంట్‌లు (0)