ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపరోపకారం.. ఎల్లలు లేని ఆనందం

3 గంటల క్రితం

thumb.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 29, 2026, 07:06 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

జాహ్నవి ఎనిమిదో తరగతి చదువుతోంది. చిన్నప్పటి నుంచే ఇతరులకు సాయం చేయాలనే మంచి మనసు ఆమెది. తండ్రి ఇచ్చే కొద్దిపాటి పాకెట్ మనీని తినుబండారాలు, ఆటబొమ్మల కోసం ఖర్చు చేయకుండా రూపాయి రూపాయి దాచుకునేది. ఒకరోజు పాఠశాల దగ్గర కొందరు విభిన్న ప్రతిభావంతులైన పిల్లలు ఒంటరిగా, దిగులుగా కూర్చుని ఉండటం జాహ్నవి గమనించింది. వారిని చూసినప్పుడల్లా తన తోటి పిల్లల్లాగే వారు కూడా ఆడుకోవాలని, చదువుకోవాలని అనుకునేది. వారికి ఏదైనా చేయాలనే ఆలోచన ఆమె మనసులో బలంగా నాటుకుంది. డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం గురించి పాఠశాలలో తెలుసుకున్న జాహ్నవికి ఒక ఆలోచన వచ్చింది. తాను దాచుకున్న డబ్బుతో బొమ్మల పుస్తకాలు, రంగులు, చిన్న చిన్న ఆటవస్తువులు కొనుక్కొని, ఆ పిల్లలకు ఇచ్చింది. వారితో కలిసి ఆడుకుంది. ఆ పిల్లల ముఖాల్లో విరిసిన చిరునవ్వులు చూసి ఎంతో సంతోషించింది. కానీ మరుసటి రోజు నుంచి ఆమెను ఒక ప్రశ్న వేధించసాగింది. 'ఈ పిల్లలకు ఇలాంటి ఆనందాన్ని ఎప్పుడూ అందించాలంటే ఏమి చేయాలి?' అని ఆలోచించింది. చివరకు తన క్లాస్ టీచర్‌ను కలిసి విషయం చెప్పింది. ఆమె జాహ్నవి మంచి మనసును అభినందించి, విభిన్న ప్రతిభావంతులైన పిల్లల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న 'భవిత సెంటర్ల' గురించి వివరించారు. ప్రధానోపాధ్యాయుల సహకారంతో ఆ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి, వారిని భవిత సెంటర్లలో చేర్పించారు. జాహ్నవి కోరిక నెరవేరింది. పాఠశాల అసెంబ్లీలో ప్రధానోపాధ్యాయులు ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఒక చిన్నారి మంచి ఆలోచన ఎంతోమంది పిల్లల జీవితాల్లో మార్పునకు కారణమైంది.

దేవరపు ఝాన్విస్రి .jpg

దేవరపు ఝాన్విశ్రీ

8వ తరగతి, బీవీఆర్ఎం బాలికల ఉన్నత పాఠశాల,

పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా.

​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్