శుక్రవారం, 27 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆటలాడుతూ పాఠాలు నేర్చుకుంటున్నా!

15 నవంబర్, 2026

WhatsApp Image 2026-11-07 at 4.12.28 PM.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 15, 2026, 01:31 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హాయ్ ఫ్రెండ్స్‌!

మీరంతా బాగున్నారా? నాకు మా స్కూలంటే చాలా ఇష్టం. రోజూ ఉదయాన్నే చక్కగా తయారై స్కూలుకు వెళ్లాలనిపిస్తుంది. మా టీచర్లు మాతో ఎంతో ప్రేమగా మాట్లాడతారు. పుస్తకాల్లోని పాఠాలే కాకుండా ఆటలు, పాటలు, చిన్నచిన్న కథలతో ఎన్నో విషయాలు నేర్పిస్తారు. మేమంతా కలిసి ఆడుకుంటూ, పాడుకుంటూ చదువుకుంటుంటే సమయమే తెలియదు. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా స్కూల్లో పండుగలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా వేడుకలు చేస్తారు. సంక్రాంతి, దసరా, దీపావళి వంటి పండుగలను అందరం కలిసి జరుపుకుంటాం. అప్పుడు మా స్కూలంతా సందడిగా ఉంటుంది. ఆ వేడుకల్లో పాల్గొనడం, స్నేహితులతో కలిసి ఆటలు ఆడటం నాకు చాలా ఇష్టం. పండుగల గురించి, మన సంప్రదాయాల గురించి కూడా తెలుసుకుంటున్నాను. మా స్కూల్లో చదువుతో పాటు ఆటపాటలకు, వేడుకలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. మేము చేసే చిన్నచిన్న ప్రయత్నాలను కూడా మా కరస్పాండెంట్‌ వల్లభనేని మురళీకృష్ణ, ప్రిన్సిపాల్‌ వల్లభనేని నాగలక్ష్మి అభినందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తుంటారు. వారు మమ్మల్ని మెచ్చుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా బాగా చదువుకోవాలని, కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలని అనిపిస్తుంది. పెద్దయ్యాక మంచిపేరు తెచ్చుకోవాలనేది నా కోరిక.

ధ్రువన్‌ తేజ్‌

1వ తరగతి,

బచపన్‌ ప్లే స్కూలు,

తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్