హాయ్ ఫ్రెండ్స్!
నాకు మట్టిలో ఆడుకోవటమంటే చాలా ఇష్టం. ఇసుకలో ఆడుకోవడం ఇంకా ఇష్టం. ఇసుకతో చిన్నచిన్న ఇళ్లు కడతాను. ఇసుకను చేతులతో తీసుకుని ఇల్లు కడుతుంటే భలే సరదాగా ఉంటుంది. ఒక్కోసారి నా స్నేహితులతో కలిసి ఇసుకలో ఆడుకుంటాను. నాకు బొమ్మలు గీయడం కూడా ఇష్టమే. పెన్సిల్ తీసుకుని నాకు నచ్చిన బొమ్మలు గీస్తాను. వాటికి రంగులు కూడా వేస్తాను. నేను గీసిన బొమ్మలను అమ్మానాన్నలు ఆళ్ళ సుస్మిత, గిరీష్‌కుమార్‌లకు చూపిస్తాను. వాళ్లు చూసి మెచ్చుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. స్కూలుకు వెళ్లడం, చదువుకోవడం కూడా ఇష్టమే. స్కూల్లో స్నేహితులతో కలిసి ఆడుకుంటాను. ఇంటికి వచ్చాక హోంవర్క్ చేసుకుంటాను. తర్వాత ఇసుకలో ఇళ్లు కడతాను. బొమ్మలు గీస్తాను. ఇలా ఆడుకుంటూ, బొమ్మలు వేస్తూ హాయిగా గడుపుతాను.
మట్టిలో ఆడుకుంటా.. ఇసుకలో ఇళ్లు కడతా.. నచ్చిన బొమ్మలు గీస్తా!

ఆళ్ళ అభినవ్ కార్తీక్
1వ తరగతి, అరవింద ఇంగ్లీషు మీడియం స్కూలు,
కుంచనపల్లి, గుంటూరు జిల్లా.








కామెంట్‌లు (0)