ఆదివారం, 19 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపోటీలో ఎస్‌పిఎల్‌గా గెలిచా...

6 గంటల క్రితం

Back page
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 07:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మా పాఠశాలలో ఎస్‌పిఎల్‌ ఎన్నికలు జరిగాయి. మొత్తం నలుగురం పోటీపడ్డాం. ఎన్నికల్లో అందరి కంటే అధిక ఓట్లు సాధించిన నన్ను ఎస్‌పిఎల్‌గా పాఠశాల యాజమాన్యం నియమించింది. నాయకత్వ లక్ష‍ణాలు నీకు బాగా ఉన్నాయి. పోటీ చెయ్యమని తోటి విద్యార్థినీ విద్యార్థులు కోరిన మీదట నేను కూడా పోటీ చేశాను. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించాలనే ఆలోచనతో స్కూల్ యాజమాన్యం ఎస్‌పిఎల్‌కు ఎన్నికలు జరిపింది. గతంలో అబ్బాయిలు మాత్రమే ఎస్‌‌పిఎల్‌‌గా ఉన్నారు. అమ్మాయిల్లోనూ నాయకత్వ లక్ష‍ణాలను పెంపొందించాలని యాజమాన్యం భావించింది. ఈ క్రమంలోనే నా స్నేహితులు, తల్లిదండ్రులు మెరుగుమాల రాఘవులు, నీలిమ ప్రోత్సాహం మేరకు పోటీ చేసి గెలుపొందాను. నేను చదువుతోపాటుగా ఆటపాటల్లోనూ ముందుపీఠినే ఉంటాను. ఎస్‌‌పిఎల్‌‌గా నాకు అప్పగించిన బాధ్యత సామాన్యమైనదని నేను భావించటం లేదు. నాపై ఉపాధ్యాయులు, తోటి మిత్రులు ఉంచిన నమ్మకంగా భావిస్తున్నా. నాలో ఏమైనా లోపాలు ఉంటే వాటిని సరిచేసుకుని, నాకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా చేస్తాను. ఎస్‌పిఎల్‌గా నాకు పాఠశాల విద్యార్థులంతా జెండాలతో వచ్చి, గౌరవ వందనం వారు చేయటం, నేను స్వీకరించటం నా జీవితంలో మరపురాని సంఘటన. అందుకోసమే తోటి విద్యార్థులకు ఆదర్శంగా ఉండటానికి కృషిచేస్తాను. పాఠశాల క్రమశిక్షణను కాపాడటానికి ప్రాధాన్యత ఇస్తాను. అలాగే విద్యార్థుల సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించటానికి కృషి చేస్తాను. పాఠశాలలో నిర్వహించే వివిధ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడానికి నా వంతుగా ప్రయత్నం చేస్తాను.

- మెరుగుమాల సెనోరిట

9వ తరగతి, డాన్ బోస్కో స్కూల్ (సీబీఎస్ఈ),

గుంటుపల్లి, ఇబ్రహీంపట్నం మండలం, ఎన్టీఆర్ జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్