హాయ్ ఫ్రెండ్స్!
కలెక్టర్ కావాలనేది నా జీవితాశయం. అయితే ముందుగా నేను ఒకరోజు కలెక్టర్‌గా పనిచేస్తే ఏమి చేస్తానంటే..! ముందుగా నిస్వార్ధంగా పనిచేస్తా. జిల్లా ప్రజానీకం స్వేచ్ఛగా కలెక్టర్‌ను కలిసే అవకాశాన్ని కల్పిస్తా. నా దృష్టికి వచ్చిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించటానికి ప్రాధాన్యత ఇస్తా. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాటిని పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తా. ప్రజలకు అందుబాటులో ఉంటాను. తమ ఫిర్యాదులను, అవసరాలను ఎవరూ పట్టించుకోవడం లేదనే భావన ప్రజల్లో లేకుండా చేస్తాను. ఎవరైనా ఏ సమస్యతో వచ్చినా ఓపికగా విని, పరిష్కారం చూపిస్తాను. ప్రజలకు మౌళిక సదుపాయాలు, వసతులు కల్పించే విషయమై ప్రాధాన్యత ఇస్తాను. ప్రతి గ్రామానికి, ప్రతి కాలనీకి తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటాను. కాలనీల్లో, రోడ్లపై చెత్త పేరుకుపోకుండా పారిశుధ్య కార్యక్రమాలను ప్రోత్సహిస్తాను. ప్రతి ఒక్కరికీ సమాన విద్యావకాశాలు కల్పించడానికి కృషి చేస్తాను. నీటి వృథాను అరికట్టేందుకు రైతులకు బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) పద్ధతిని పరిచయం చేసి, ప్రోత్సహిస్తాను. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అవసరమైన చోట వేగ నియంత్రణ వ్యవస్థలను ఏర్పాట్లు చేస్తాను. ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తాను. ఇలా ప్రజలందరి సహకారంతో పర్యావరణిరక్షణకు పాటుపడుతూనే మా జిల్లాను పరిశుభ్రంగా, పచ్చగా, అభివృద్ధి చెందిన జిల్లాగా మారుస్తాను. నేను పనిచేసిన జిల్లా పేరు అన్నిరంగాల్లో ముందుండేలా రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగేలా కృషి చేస్తాను. ప్రజల మన్ననలు పొందే మంచి కలెక్టర్‌గా నిలవడమే నా ఆశయం.
జె. కార్తీక్ రెడ్డి
9వ తరగతి,
అరవింద హైస్కూల్,
కుంచనపల్లి,
తాడేపల్లి మండలం, గుంటూరుజిల్లా.








కామెంట్‌లు (0)