హాయ్ ఫ్రెండ్స్!
మీరెప్పుడైనా మీ స్కూలును మీ ఇంటిలా శుభ్రంగా ఉంచుకున్నారా? నేను మాత్రం మా స్కూలును చాలా ఇష్టపడతాను. అందుకే మా స్కూలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలని కోరుకుంటాను. మా టీచర్లు మాకు ఎన్నో మంచి అలవాట్లు నేర్పిస్తున్నారు. ఉదయం స్కూలుకు రాగానే చక్కగా ఉండాలని, భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలని, చెత్తను నేలపై వేయకుండా చెత్తబుట్టలో వేయాలని చెబుతుంటారు. తిన్న తర్వాత చేతులు, నోరు శుభ్రం చేసుకోవాలని కూడా నేర్పిస్తున్నారు. మేమంతా ఈ అలవాట్లను పాటించటానికి ప్రయత్నిస్తున్నాం. శుభ్రంగా ఉంటే జబ్బులు రావని, ఆరోగ్యంగా ఉండవచ్చని మా టీచర్లు చెబుతుంటే నాకు చాలా బాగా అర్థమైంది. మా స్కూల్లో పండుగలు, ప్రత్యేక దినోత్సవాలు కూడా ఘనంగా జరుపుతారు. ఆ రోజుల్లో స్కూలును అందంగా అలంకరిస్తారు. మేమంతా సంతోషంగా పాల్గొంటాం. మా మంచి అలవాట్లను చూసి కరస్పాండెంట్ వల్లభనేని మురళీకృష్ణ, ప్రిన్సిపాల్ వల్లభనేని నాగలక్ష్మి మమ్మల్ని అభినందిస్తుంటారు. వారు చెప్పే మంచి మాటలు నాకు ఎంతో నచ్చుతాయి. నేను కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంటూ, అందరికీ మంచి అలవాట్లు నేర్పించాలనుకుంటున్నాను.
మోక్షిత్ నాయుడు
1వ తరగతి, బచపన్ ప్లే స్కూలు,
తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా.








కామెంట్‌లు (0)